No products in the cart.
ఫిబ్రవరి 13 – గురి యొద్దకే పరుగెత్తుచున్నాను!
“కాబట్టి నేను గురి చూడని వానివలె పరుగెత్తు వాడనుకాను; గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” (1. కోరింథీ. 9:26).
‘అందరు పరుగెత్తుచున్నారు, కావున నేను కూడా పరుగెత్తుచున్నాను’ అని కొందరు పరుగెత్తుచున్నారు. కొందరు పరుగు పంద్యపు రంగములో ఎలాగో వచ్చేసాను అందువలన పరిగెత్తి ముగించెదను అని పరుగెత్తుచున్నారు. కొందరు ఇతరులను చూచి పరుగెత్తుచున్నారు. ఈ సంగతి అంతటిని అపో. పౌలు తన్నుతాను పరిశీలించి చూచుకొని: “నేను గురి చూడని వానివలె పరుగెత్తు వాడనుకాను; గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అని వ్రాయుచున్నాడు.
అవును, గురి యొద్దకే పరుగెత్తుట ఎంతటి అవశ్యము! ఇట్టి పరుగునందు దృఢమైన గురి లేకున్నట్లయితే శోధనగాలి వీచుచున్నప్పుడు, శ్రమలు తుఫాను వలె వచ్చుచున్నప్పుడు ఎదురు నిలబడి తట్టుకోలేము. గాలియును, వర్షమును, అగ్నియును మీ యొక్క దృఢత్వమును పరిశోధించును. అప్పుడు మీ యొక్క పరిస్థితి ఏమగును?
నేడు మరణించినను ప్రభువు యొక్క రాజ్యమునందు కనపడుదుము అను నిశ్చయత ఎంతమందికి ఉన్నది? నేడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల రాకడ ఉండినట్లయితే, ఆయన యొక్క రాకడలో కనబడుదును అను నిశ్చయత ఎంతమందికి ఉంది? ఇట్టి ప్రశ్నలకు అంతయు లేదు అనుటయే అనేకుల యొక్క జవాబునైయున్నది. దొంగ వలె ప్రభువు వచ్చుచునప్పుడు వీరు ఏమి చేయుదురు? ఎదురు చూడని మరణమును సంధించుచున్నప్పుడు నిత్యత్వమునందు వీరీ యెక్క పరిస్థితి ఏమిటి?
రక్షణ యొక్క నిశ్చయత మీకు ఉన్నదా? రక్షణ యొక్క సంతోషమునందు మీరు నిలచియున్నారా? బహుశా మీరు రక్షణ పొందక ఉండినట్లయితే నిజమైన పశ్చాతాపముతో పాపములను ఒప్పుకోలు చేసి, క్రీస్తు యొక్క రక్తము చేత పాప క్షమాపణ యొక్క నిశ్చయతను పొందుకొనుటకు ముందుకు రండి.
పరిశుద్ధాత్ముని యొక్క నిశ్చయతను పొందుకొనుట అత్యవసరమునైయున్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ఎంతో నిశ్చయముగా కదా అనెను” (లూకా. 11:13).
మీయొక్క పిలుపును, ఏర్పాటును దృఢపరుచుకొనుడి. ప్రభువు మిమ్ములను పిలిచినది వాస్తవము అయితే మిమ్ములను పోషించుటయు, వస్త్రమును ధరింప చేయుటయు నిశ్చయమే. అడవి పుష్పములను అలంకరించిన యెడల మీకు కూడాను వస్త్రమును ధరింపజేయుట అధిక నిశ్చయము కదా? (మత్తయి. 6:30).
అబ్రహాము దేవుని యొక్క పిలుపును పొందిన వెంటనే తాను ఎక్కడికి వెళ్ళవలెను అను సంగతిని ఎరుగక ప్రభువు యొక్క మాటకు లోబడెను. (హెబ్రీ. 11:8) అని బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము. అపో. పౌలు దేవుని యొక్క పిలుపును నిశ్చయించుకొనెను అని అపో.కా. 16:10 ‘లో చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపును పొందుకొని నిశ్చయతతో పరిచర్యను చేయుడి. అది మీకు విజయమును తెచ్చి పెట్టుట నిశ్చయమే.
నేటి ధ్యానమునకై: “కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు” (రోమీ. 5:17).
