Appam, Appam - Telugu

ఫిబ్రవరి 11 – అబ్బా తండ్రీ!

“ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని, అబ్బా తండ్రీ, అని మొఱ్ఱపెట్టుచున్న దత్తపుత్ర స్వీకృత ఆత్మను పొందితిరి” (రోమీ. 8:15).

భూసంబంధులైయున్న మనుష్యులైన మనము, ఆకాశమును భూమిని కలుగజేసిన సర్వశక్తి గల దేవున్ని “అబ్బా తండ్రీ” అని పిలిచి ప్రార్ధించుట ఎంతటి ధన్యతయైయున్నది!

సెరాపులు కూడాను భయముతో తమ యొక్క రెక్కలతో ముఖములను కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్లను కప్పుకొని ఎగురుచు ఆయనను ఆరాధించుచున్నప్పుడు, మనము ధైర్యముగా కృపాసనము వద్దకు వెళ్లి సమీపించి ఆయన యొక్క బిడ్డలు అను హక్కుతో ఆయనతో మాట్లాడుట ఎంతటి ధన్యతయైయున్నది!

యేసుక్రీస్తు శిష్యులను విడిచి పెట్టి తండ్రి యొక్క కుడిపాశ్వమునందు కూర్చుండునప్పుడు, అట్టి ఎడబాపు యొక్క వేదనను తొలగించుట కొరకు పరిశుద్ధాత్మను పంపించెను. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుణ్ణి ‘అబ్బా తండ్రీ’ అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత ఆత్మను మనము పొందియున్నాము.

ఇకమీదట మన యొక్క ప్రార్థనలను దేవుని దూతలు యాకోబు యొక్క నిచ్చన ద్వారా పరలోకమునకు తీసుకొని వెళ్ళవలసిన అవసరము లేదు. మనము ఇక్కడ ప్రార్థించుచున్నప్పుడే పరిశుద్ధాత్ముని యొక్క సహాయము వలన మన యొక్క విజ్ఞాపనలు వెనువెంటనే పరలోకమునకు కొనిపోబడుచున్నది. మనము మొరపెట్టుటకు మునుపే ఆయన ఆలకించుచున్నాడు. మన యొక్క ప్రతి ప్రార్థనకు అవును అనియు, ఆమెన్ అనియు జవాబును ఇచ్చుచున్నాడు.

ప్రస్తుతమునందు చరవాణి మనకు ఎంతో ఉపయోగకరముగా ఉన్నది. ఒక తండ్రి తన పిల్లవాణ్ణి పలుమైళ్ళ దూరములో నుండి ‘నా కుమారుడా’ అని పిలిచిన వెంటనే అవతల వైపు నుండి ఆ క్షణముంనందే పిల్లవాణ్ణి యొక్క స్వరము “ఏమిటి నాన్నగారు?’ అని ధ్వనించుచున్నది.

ఈ చరవాణి కంటేను శ్రేష్టమైనది ప్రార్ధన కదా? ఆ ప్రార్ధన మనలను పరలోకముతో ఏకము చేయుచున్నది. మనము ఎట్లు యుక్తముగా ప్రార్థించవలెను అనుట తెలియక ఉన్నాము. అలాగున ఉన్న కూడాను ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో మన పక్షముగా మన కొరకు దేవుని యొక్క కుడి పాశ్వమునందు విజ్ఞాపన చేయుచున్న క్రీస్తుతోపాటు మన యొక్క ప్రార్థన మనలను ఏకము చేయుచున్నది.

“దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పికచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను” అని ప్రభువు వాగ్దానమును ఇచ్చుచున్నాడే (యెషయా. 41:17).

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇదిగో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు” (కీర్తనలు. 121:4,5,6). దేవుని బిడ్డలారా, రాత్రియు పగలును ఎప్పుడు కావలసినను మీరు ప్రభువును తేరి చూచి మొరపెట్ట వచ్చును. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకుటయు లేదు. నిద్రించుటయు లేదు.

నేటి ధ్యానమునకై: “వారు వృథాగా ప్రయాసపడరు; ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదింప బడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను” (యెషయా. 65:23,24).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.