Appam, Appam - Telugu

ఫిబ్రవరి 03 – సహవాసము కలిగియుండుడి!

“మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు, మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము; మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది” (1. యోహాను. 1:3).

వ్యక్తిగత ప్రార్థన యొక్క మిగుల ఔన్నత్యమైన ఒక భాగము దేవునితో సహవాసము కలిగియుండి, ఆనందముగా ఆయనతో సత్సంబంధము కలిగి యుండుటయైయున్నది. అనేకమంది ప్రార్థన సమయములో తమ వేదనలను పెద్ద పట్టికగా కలిగియుండి దేవుని యొక్క సన్నిధికి వచ్చుచున్నారు. అక్కడ కూర్చుండి వేలకొలది అంశములను దయచేయమని అడుగుచున్నారు.

అయితే ప్రభువు, మన యొక్క ప్రేమనే ప్రధానముగా కాంక్షించుచున్నాడు. మన యొక్క ఆనందకరమైన సత్సంబంధమును ఎదురుచూచున్నాడు. మనతో సహవాసమును కలిగి ఉండుటకే కోరుచున్నాడు. మనము ప్రార్థన ద్వారా ప్రభువుకు పరిచర్యను చేయవలెను. ప్రేమగల దేవుడైయున్న ప్రభువును ప్రేమించవలెను. మనము మొదటిగా దేవుని యొక్క అవసరతను సంధించవలెను. అవును, అదే ఆయనతో సహవాసను కలిగియుండి ఆయనను ఆరాధించుటయైయున్నది.

ఆది మనుష్యుడుని సృష్టించినప్పుడు అతడు దేవునితో సహవాసము కలిగి ఉండేటువంటి ఒక పరిస్థితుల్లోనే అతనిని సృష్టించెను. దేవుడు కూడాను మనుష్యుని యొక్క సహవాసమును కోరి, ప్రతి దినమును పగటివేల చల్లబూట సమయమునందు అతనిని వెదకి వచ్చెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “పగటివేల చల్లబూట సమయమునందు ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వినిరి” (ఆది.కా. 3:8). దేవుడైన యెహోవా ఆదాముతోను అవ్వతోను సహవాసమును కలిగియుండుటకే వచ్చెను.

దేవునితో సహవాసమును కలిగియున్నప్పుడు మనుష్యుని యొక్క అంతరంగమునందు ఉల్లసించుట కలుగుచున్నది. అర్థము కాని ఒకరకమైన మనస్సునందు నిండుతనము కలిగి అంతరంగమును నిమ్మలపరుచుచున్నది. అవును, ప్రభువు మన యొక్క సహవాసమునందును, వ్యక్తిగత ప్రార్థనయందును, మన యొక్క ప్రేమయందును ఆరాటపడుచున్నవాడై ఉన్నాడు. దాని కొరకే మనలను తన యొక్క పోలికలో తన యొక్క స్వారూప్యములో సృష్టించెను.

నేడు అనేకులు పని పని అని పరిగెడుచున్నారు. తమ యొక్క సమస్యలను, పోరాటములను తీర్చుకొనుటకై వేగిరిపడుచున్నారు. ఆ వ్యక్తిని చూడవలెను, ఈ వ్యక్తిని చూడవలెను, ఆ అప్పును తీర్చవలెను, ఈ క్రొత్త ఉద్యోగమునకు ప్రయత్నము చేయవలెను అని రోజు అంతయును వారు పరుగులు తీయుటయందే ఉంటున్నారే గాని, ప్రభువు యొక్క పాదములయందు కూర్చుండి ఆయనతో సహవాసమును కలిగి ఉండుటలేదు.

ఇందువలన వారు సంతోషమును కోల్పోవుచున్నారు. సమస్యలు వారిని అధికమించుచున్నాయి. పోరాటములు వారిని మోహరించూచుచున్నాయి. పలు విధములైన ఇబ్బందులు వారి యొక్క జీవితములోనికి వచ్చుచున్నాయి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియును మీకనుగ్రహింపబడును” (మత్తయి. 6:33).

దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెదకి, ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడు, మిగతావన్నీయును ప్రభువు మీకు కూడా అనుగ్రహించి ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: “అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు; ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము” (ప.గీ. 2:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.