No products in the cart.
నవంబర్ 10 – రాకపోకలయందు!
“ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును” (కీర్తనలు. 121:8).
జీవితమంటేనే పోకడయు రాకడయైయున్నది. ఉదయమునే ఉద్యోగమునకు వెళ్ళుచున్నాము, సాయంకాలమునందు ఇంటికి తిరిగి వచ్చుచున్నాము. స్నేహితులు, బంధువులు, కుటుంబమునందుగల ప్రత్యేకమైన కార్యక్రములకు వెళ్ళుచున్నాము. తిరిగి వచ్చుచున్నాము. పలు ఊరులకు వెళ్ళుచున్నాము; తిరిగి వచ్చుచున్నాము. అవును! మన యొక్క జీవితము అంతయును మనము పోవుటయు వచ్చుటయునైయున్నాము.
ఇట్టి నవీన కాలమునందు వాహనపు విపత్తులు విస్తారముగా పెరిగినప్పుడు ఇంటిని విడిచిపెట్టి బయలుదేరుచున్న వారు తిరిగి వస్తారా అనేటువంటి సందేహము గలదైయున్నది. దారి పొడుగూత విపత్తులకు గురై, నుజ్జు నుజ్జైపోయిన వాహనములను చూచుచున్నాము.
ఇటీవల కాలమునందు అహ్మదాబాద్ విమాన ఆశ్రయము నుండి లండన్నకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానము, బయలుదేరిన మరికొన్ని నిమిషములలో, ఎగిరి వెళ్లి జననివాసము గల ప్రాంతములోనికి వెళ్లి, విపత్తునకు గురి ఆయెను. అందులో ప్రయాణము చేసిన ఒకరు తప్ప, మిగతా ప్రయాణికులును, విమాన సిబ్బందులును, విమానము నడుపు వారును మరణించిరి. వారు ఇంటి నుండి బయలుదేరుచున్నప్పుడు ఇదియే తమ యొక్క జీవితమునందు చివరి ప్రయాణము అని తలంచి ఉండరు.
అయితే ప్రభువు యొక్క కాపుదల కొరకు మనము ఆసక్తితో ప్రార్ధించుచున్నప్పుడు, ప్రభువు వాగ్దానముగా చెప్పుచున్నాడు, నీ యొక్క రాకపోకలను నిరంతరమును కాపాడుదును. కాపాడుట మాత్రము కాదు, మనలను ఆశీర్వదించుటకు కూడా ఆయన సంకల్పించియున్నాడు.
“నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు” (ద్వితి. 28:6). “నీ ప్రవర్తన అంతటియందు ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకొనుము; అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” (సామెతలు. 3:6) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
మీరు ఎక్కడికి వెళ్ళినను ప్రార్ధన చేసి బయలుదేరుడి. దేవుని సన్నిధి ముందు వెళ్ళుటకు సమర్పించుకొని వెళ్లుడి. అప్పుడు మీ మార్గములయందు మిమ్ములను కాపాడుటకు ప్రభువు తన యొక్క దూతలకు ఆజ్ఞాపించును. ప్రభువు యొక్క సమూఖమును, ప్రసన్నతయు మీతో కూడా ఉండును.
దావీదు యొక్క రాకను పోకను ప్రభువు ఆశీర్వదించినందున ఫిలీస్థియ్యుల రాజైన ఆకీషు అనువాడు దావీదును పిలిచి, “యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే” అని సాక్ష్యమును ఇచ్చెను (1. సమూ. 29:6).
ప్రభువు మీతో కూడా ఉన్నట్లయితే, మీ రాకయు పోకయు ఆశీర్వాదకరమైనదిగా ఉండును. మీరు ఒక స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు, దేవుని సమూఖమును, ప్రసన్నతయు మీతో కూడా వచ్చును. సైన్యములకు అధిపతియగు యహోవా మీతో కూడా వచ్చును. వేలకొలది పదివేల కొలది దేవదూతలు మీతో కూడా వచ్చుదురు. మీరు వెళ్ళుచున్న కార్యము సఫలమగును. మీరు వెళ్ళుచున్న స్థలములయందు దేవుని నామము మహిమ పరచబడును. దేవుని బిడ్డలారా, ప్రభువు నిశ్చయముగానే మీయొక్క రాకపోకలను నిరంతరము ఆశీర్వదించును.
నేటి ధ్యానమునకై: “నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును” (కీర్తనలు. 18:29).