No products in the cart.
నవంబర్ 09 – యెహోవా నిన్ను!
“పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును” (కీర్తనలు. 121:7).
క్రైస్తవ జీవితము అనునది పత్తిపానుపు కాదు, గులాబీ పూలతో అలంకరింపబడ్డ జీవితమును కాదు. “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జెయించియున్నాను” (యోహాను. 16:33) అని ప్రభువు చెప్పెను.
“నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తనలు. 34:19). అని దావీదు చెప్పెను. అయితే, ప్రతి పరిస్థితులయందును ప్రభువు మనలను కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ధైర్యమును తెచ్చుకొనుడి నేను లోకమును జెయించియున్నాను అని చెప్పుచున్నాడు.
ఆయన పగలును రాత్రియును మనలను కాపాడువాడు. పగలు అనుట మనము మన యొక్క పనులను చేయుచున్న సమయమును సూచించుచున్నది. రాత్రి అనుట పనిచేయ లేనివారమై నిద్రించుచున్న సమయమును సూచించుచున్నది.
మనము పని చేసినను మిశ్రమించినను ప్రభువు మనలను కాపాడుచున్నాడు. బలవంతులమై ఉండినప్పటికీని, బలహీనులమై ఉండినప్పటికీని ప్రభువే మనలను కాపాడుచున్నవాడు. పగటి యొక్క ప్రమాదములలో నుండియు, రాత్రి యొక్క చిల్లంగి తనములబారి నుండి మనలను కాపాడుచున్నవాడు.
అంత మాత్రమే కాదు, ఎండలోనైనను, నీడలోనైనను మనలను కాపాడుచున్నవాడు. “ఎండ బహిరంగమైనది, నీడ తంత్రమునైయున్నది” అని చెప్పెను ఒకరు. ఎండ వలే మనలను జెయించేటువంటి పరిస్థితులు వచ్చినను, నీడవలే మాధుర్యముగా ఆవరించి కీడును ఫలింపజేయు పరిస్థితులు వచ్చినను ప్రభువు మనలను కాపాడుటకు శక్తిమంతుడు.
ఆయన మన పోకయందును, రాకయుందును మనలను కాపాడుచున్నవాడు. వృత్తుల కొరకును, ఉద్యోగ స్థలముల కొరకును బయటకు వెళ్ళుచున్నాము. విశ్రాంతి కొరకును విశ్రమించుట కొరకును ఇండ్లకు తిరిగి వచ్చుచున్నాము.
పలు సమయములయందు బయటకు వెళ్ళుచున్నప్పుడు ఈ దినము ఎలాగు ఉండునో, దేనిని ఎదుర్కొనబోవుచున్నామో అని కలత చెందుచున్నాము. అయితే ప్రభువు, మనతో కూడా వచ్చుచున్నాడు. నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళును అని చెప్పి మన పోకయందును, రాకయందును మనలను కనుపాపవలె కాపాడుకొనుచున్నాడు.
పగటియందును, రాత్రియందును, ఎండయందును, నీడయందును మాత్రము కాదు, ఆయన నిత్యమును కాపాడువాడు. మరణమైనను, జీవమైనను మనలను కాపాడువాడు. అందుచేతనే, “గాఢాంధకారపు మరణపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను; నీవు నాకు తోడైయుందువు; నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును” (కీర్తనలు. 23:4) అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు.
“ఆదియు నీవే, అంతము నీవే, జ్యోతియు నీవే, నా సొంతమును నీవే” అని మనము పాడి ప్రభువును మహిమ పరచుచున్నాము. మనము ప్రభువు యొక్క అరచేతిలో ఉన్నాము. అట్టి గొప్ప ప్రకాశవంతమైన హత్తముచే ఆయన మనలను మలచియున్నాడు. ఆయన యొక్క హస్తములో నుండి మనలను ఎవరును అపహరింప లేరు.
నేటి ధ్యానమునకై: “నేను వాటికి నిత్యజీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు” (యోహాను. 10:28).