No products in the cart.
నవంబర్ 07 – పాడుడి!
“యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి” (కీర్తనలు. 96:2).
మన యొక్క దేవుడు మన యొక్క ఆరాధనకును, స్తోత్రములకును పాత్రుడైనవాడు. మనలను ప్రేమతో రూపించినవాడు, ప్రేమతో వెతికి వచ్చినవాడు, అమితముగా ప్రేమించువాడు. మనము ఆయనను పాడి స్తుతించి ఆరాధించుచున్నప్పుడు ఆయన యొక్క ప్రసన్నతయు, మహిమయును మన మధ్యలోనికి దిగి వచ్చుచున్నది.
ఒకానొక కాలమునందు ప్రభువునకు ఆరాధన చేయుచున్న లూసిఫరు, ఆరాధనను తనకంటూ తీసుకొనుటకు ప్రారంభించెను. కావున అతడు పరలోకము నుండి త్రోయబడి సాతానుగా మారిపోయెను. నేడును అతడు కుర్రకారులను, యవనస్థులను ఆకర్షించునట్లుగా ఇచ్చలతో కూడిన సంగీతమును రూపించుచున్నాడు.
మన యొక్క సమాజపు కుర్రకారులు కొత్త కొత్త పాటలు చేత ఆకర్షింపబడి పలు రకాల సంగీత కళాకారులను అనుసరించుటకు ప్రారంభించియున్నారు. పాడేటువంటి, నాట్యము ఆడేటువంటి, సంగీతమును ప్రధానముగా కలిగియుండేటు వంటి కళాకారుల యొక్క నీచమైన కార్యక్రమములకు విస్తారముగా తరలివచ్చి అల్లరితో కూడిన కేకలు పెట్టుచున్నారు.
ప్రస్తుత కాలమునందు విడుదల చేసేటటువంటి అనేక సంగీతములును పాటలును అపవిత్ర ఆత్మలను రప్పించుచున్నదిగాను సాతానును మహిమ పరిచేటు వంటిదిగాను అమర్చబడి ఉన్నాయి. ఇది నేటి సమాజమును ఆకర్షించి తన యొక్క కబంధ హస్తములో పెట్టుకొని ఉన్నది.
విదేశాలయందు ఒయాసిస్ అను వాయిద్య బృందము పేరుగాంచినదై ఉండెను. దీని యొక్క అధినేతగా ఉన్న లియం కళాకార్ అనువాడు మాట్లాడుచున్నప్పుడు, “మేము యేసు కంటే పేరును గాంచిన వారమైయున్నాము. యేసు ప్రభునకు వచ్చిన విస్తారమైన ప్రజల కంటే మాకు అత్యధిక సంఖ్యలో ప్రజలు వచ్చుచున్నారు. మాయొక్క అభిమానులు మమ్ములను దేవుని కంటే ప్రాముఖ్యపరచుచున్నారు” అని చెప్పెను.
తమ్మును సృష్టించి, తమ్మును ప్రేమించుచున్న ప్రభువును వారు తృణీకరించియున్నారు. ఆయనే నిత్య న్యాయాధిపతి అనియు, ఆయన యొక్క న్యాయ తీర్పునకు ఎదుట ఒక దినమున నిలబడవలసినది వచ్చును అను సంగతిని గ్రహించని వారైయున్నారు. “భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును” (యూదా. 1:15).
కావున అంత్యకాలములోనికి వచ్చియున్న దేవుని బిడ్డలమైయున్న మనము ప్రభువును సుతించి ఆరాధించి ఆయన యొక్క రాకడకు సిద్ధపడుదుము గాక. ప్రభువును స్తుతించుటకును, పాడుటకును, ఆరాధించుటకును దైవీకమైన రాగములను ఆయన అనుగ్రహించియున్నాడు. మనము అనుదిన ధ్యానము చేయుచున్నప్పుడు లేఖన వచనములతో కూడా కొన్ని పాటలను పాడి ఆనందించుదుముగాక!
కొన్ని పాతకాలపు కీర్తన గీతములు ఎంతటి లోతైన అర్థమును కలిగినవై ఉన్నాయి కదా! క్రైస్తవ అనుభవములో నుండి ఆనందించి రుచి చూచి వ్రాయబడిన దైవ దాసులు యొక్క పాటలు అవి. నిశ్చయముగానే అట్టి పాటలు మన యొక్క అంతరంగములలో దేవుని మహిమను తీసుకొని వచ్చును. దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించి పాడెదము గాక!
నేటి ధ్యానమునకై: “యెహోవాచేత విమోచించ పబడినవారు పాటలుపాడుచు, తిరిగి సీయోనునకు వచ్చెదరు; వారి తలలమీద నిత్యానందముండును, వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు; దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును” (యెషయా. 35:10).