No products in the cart.
నవంబర్ 04 – దేవుని చిత్తము!
“నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరునుగాక” (మత్తయి. 6:10).
పరలోకమునందు గల దేవుని దూతలును, కేరూబులును, సేరాపులును దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేయుచున్నారు. దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుట వారికి గొప్ప ఆనందము. మనలను గూర్చి ప్రభువు యొక్క సంకల్పము ఏమిటి? పరలోకమునందు తండ్రి యొక్క చిత్తము పరిపూర్ణముగా నెరవేర్చబడుచున్నట్లుగా భూమియందును నెరవేర్చబడవలెను అనుటయైయున్నది.
అయితే సహజముగా భూమిలో ఉన్న పరిస్థితి ఏమిటి? మనుష్యునికి స్వచిత్తమును ఇవ్వబడి ఉండుటచేత, తన యొక్క సొంత జ్ఞానమును, సొంత తెలివిని ఉపయోగించి మనస్సుకు వచ్చిన పోకడలో వెళ్లుటకు మనుష్యుడు కోరుచున్నాడు. లోకమునందుగల భోగములు అతనిని ఆకర్షించి ఈడ్చుచున్నది. మనస్సును, మాంసమును కోరుచున్నదానిని చేయునట్లు బహుతీవరముగా క్రియను చేయుచున్నాడు.
“నా తలంపులు మీ తలంపులవంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో, మీ మార్గములకంటె నా మార్గములు, మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి” (యెషయా. 55:8,9).
ప్రతి ఒక్క క్రైస్తవునిపై ప్రభువు కలిగియున్న కాంక్ష అతడు తన యొక్క సొంత సంకల్పము చొప్పున నడువక, తన సొంత యిచ్చ చొప్పున నడచి తిరుగక ప్రభువు యొక్క చిత్తము చొప్పున నడవవలెను అనుటయైయున్నది. ఒక మనుష్యుడు తనను గూర్చి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి? అనాది సంకల్పము ఏమిటి? దేవుడు తన యొక్క మనస్సునందు ఏమని తలంచుచున్నాడు అను సంగతినంతటిని, ఎరిగి క్రియచేయవలెను. అతని యొక్క త్రోవలన్నియును గొప్ప ఔన్నత్యము గల త్రోవలుగా కనబడుచున్నది. దాని కొరకు పరలోకపు జ్ఞానము కావలెను. పరలోకపు తెలివియు కావలెను.
అపో. పౌలు, “ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” (ఎఫెసీ. 5:17). అనియు, “మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు” (కొలస్సీ. 1:9,10) అనియు వ్రాయుచున్నాడు.
నిజమైన దైవజనుడు ఎవరు? ప్రసంగించుచున్న వారంతా దైవజనులు కాలేరు. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకొనుట చేతగాని, అద్భుతములు జరిపించబడుట చేతగాని ఒకడు దైవజనుడు కాలేడు. నిజమైన దైవజనుడు ఎల్లప్పుడును దేవునితో కూడా నడవవలెను. దేవునితో సంభాషించవలెను. దేవుని యొక్క చిత్తమును ఎరుగుచున్నవాడై ఉండవలెను. అతడు దేవుని యొక్క ప్రణాళికలను ఎరిగి, ఆ మార్గమునందు వెళ్ళుటచేత అతని యొక్క అంతరంగములో పరిపూర్ణమైన సంతోషమును, పరిపూర్ణముగా మనస్సునందు నిండుతనమును కలిగియుండుటతో పాటు అతని యొక్క జీవితము అంతయును ఆశీర్వాదముగా ఉండును.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును తేరి చూడుడి. ఆయన ఎల్లప్పుడును తండ్రి యొక్క చిత్తమును ఎరిగి జరిగించుటకు జాగ్రత్తగలవాడై ఉండెను. ఆయన మనుష్యులను సంతోషపరచుచు పరిచర్యను చేయక, ఎల్లప్పుడును దేవుని సంతోషపరచుచూనే పరిచర్యను చేసెను.
నేటి ధ్యానమునకై: “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమీ. 8:28)