No products in the cart.
డిసెంబర్ 29 – బలమునొందెను!
“దేవుని మహిమపరచి, విశ్వాసమువలన బలమునొందెను” (రోమీ. 4:21).
బలమును ధరించుకొనుము అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బలమును ఎలాగు ధరించుకొనుట? అబ్రహాము, తన బలమును ధరించుకొనిన తీరును పైనున్న వచనము ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. ఆ వచనమును పూర్తిగా చదువుడి. “దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసమువలన బలమునొందెను”.
ఈ వచనమునందు నాలుగు భావములు చెప్పబడియుండుటను చూచుచున్నాము. మొట్టమొదటిది, మన యొక్క దేవుడు సమర్ధుడు అనుట. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. రెండోవది, అట్టి సమర్ధతను రూఢిగా నమ్ముట. మూడోవది, దేవుణ్ణి మహిమపరచుట. నాలుగోవది, విశ్వాసము వలన బలము నొందుట.
మనము ఆరాధించుచున్న దేవుడు సమర్ధుడైయున్నాడు. ఆకాశ మహాకాశములను సృష్టించిన ఆయన సమర్థతగలవాడు. సూర్యుడు, చంద్రుడు నక్షత్రములన్నిటిని అంతరిక్షమునందు వేలాడదీసి నిర్వహించుటకు ఆయన శక్తిగలవాడు. ఆయన యొక్క శక్తి మిగతా అన్ని శక్తులను జయించేటువంటి ఒక శక్తి. అది సర్వశక్తి. ప్రభువును మనము ఎంతకెంతకు శక్తిమంతుడు అని పొగుడుచున్నామో, అంతకంతకు మనపై దేవుని యొక్క శక్తి దిగివచ్చును.
ప్రభువు యొక్క కన్నులు, “ఎవరికి నా శక్తిని ఇయ్యవలెను, ఎవరికి నా వరములను ఇయ్యవలెను అని ఆసక్తితో తేరి చూచుచునే ఉన్నది. తన యొక్క శక్తిని కనబరచవలెను అని ఆయన యొక్క కన్నులు భూమియందంతట సంచరించుచునే ఉన్నది.
సంసోనుపై దేవుని యొక్క శక్తి, కొలత లేకుండా దిగి వచ్చినప్పుడు, అతనిని బంధించి ఉంచియున్న తాళ్లును, బంధకాలును, నిప్పు తగిలిన దారమువలె కాలి బూడిదై పోయెను. ప్రభువు యొక్క శక్తి మిమ్ములను నింపుచున్నప్పుడు ఎట్టి చల్లంగి తనపు బంధకాలు గాని, చేతబడి శక్తుల బంధకముగాని, మిమ్ములను సమీపించలేవు. మిమ్ములను ఆయన అగ్నిజ్వాలగా మార్చును. ఈ దినము మొదలుకొని మీ యొక్క జీవితమునందు ఒక గొప్ప మలుపును ఆయన ఆజ్ఞాపించుటకు కోరుచున్నారు.
అబ్రహామునకు ప్రభువు వాగ్దానము చేసి సంతతిని దయచేయుదును అని చెప్పెను. ప్రభువు నిశ్చయముగానే దానిని నెరవేర్చును అను నమ్మికతో కూడా అబ్రహాము ప్రభువును ఆనుకొనెను. ప్రభువు అనుగ్రహించిన బలముచేతనే ఆకాశపు నక్షత్రమువలె సంతతిని పొందుకొనెను.
షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు ప్రభువు యొక్క మరో రకమైన శక్తిని ఆనుకొనిరి. అదియే తప్పించు సమర్థత; రక్షించు సమర్థత (దానియేలు. 3:17). ఆయన సమర్థుడు సమర్ధుడు అని హూంకరించి బేరించినట్లుగానే ప్రభువు వారిని అగ్ని గుండమునకును, రాజు యొక్క వసము నుండియు తప్పించెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఒక వాగ్దానమును ఇచ్చియుండినట్లయితే, ఆయన దానిని నెరవేర్చుటకు సమర్థతగలవాడు అను సంగతిని ఒప్పుకోలు చేయుడి. ఆకాశమును భూమియు గతించిపోయినను ప్రభువు మీకు దయచేసిన వాగ్దానములు నెరవేర్చబడక విడువబడదు.
నేటి ధ్యానమునకై: “దేవుడు తన దూతను పంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను” (దానియేలు. 6:22).