No products in the cart.
డిసెంబర్ 15 – శాశ్వతుడైన దేవుడు!
“శాశ్వతుడైన దేవుడు నీకు (నివాసస్థలము) అశ్రయము, నిత్యముగానుండు ఆయన యొక్క బాహువులు నీకు ఆధారము” (ద్వితి. 33:27)
శాశ్వతుడైన దేవుని చూడుడి! నిత్యముగా నుండు ఆయన యొక్క భాహువులను చూడుడి! అయినవలె మీకు నివాసస్థలమును, ఆధారమును దయచేయువారు మరొకరు లేరు. ఆయనే మీకు నిత్యా నిత్యముగానుండు నివాసస్థలమునైయూన్నాడు.
కొందరు తమ యొక్క అశ్రయముగా మంత్రులను, లోకమునందుగల మనుష్యులను, పోలీస్ అధికారులను వెతుకుచున్నారు. అయితే ప్రభుత్వములు మారుచున్నప్పుడు, కాలములు గతించిపోవుచున్నప్పుడు, అట్టి ఆశ్రయములు నిలిచి ఉండుట లేదు. వ్యాధి సమయములయందు అనేకులు వైద్యశాలలనే ఆశ్రయముగా ఎంచుచున్నారు. అయితే ప్రభువు యొక్క బిడ్డలుకు ప్రతి ఒక్కరికి శాశ్వతుడైన దేవుడే ఆశ్రయస్థలమును; నిత్యముగనుండు ఆయన యొక్క బాహువులే ఆధారము.
అట్టి శాశ్వతుడైన దేవుడు తన యొక్క ఆశ్రయస్థలమును మోషేకు చూపించెను. మోషే ఒక బండను చూచెను. అది జ్ఞానమైయున్న బండ, నిత్యమైయున్న బండ. అట్టి బండయందు ఒక్క సందు ఉండెను. ఆ బండ సందులో ఆయనను ఉంచి, నిత్యముగా నుండు తనయొక్క బాహువుచేత కప్పెను (నిర్గమ.33: 22). అప్పుడు మోషే అట్టి ఆశ్రయస్థలము యొక్క ఔన్నత్యమును కనుగొనుటతోపాటు ప్రభువు యొక్క మహిమగల ఒక భాగమును దర్శించెను. ఆయన వ్రాయుచున్నాడు: “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను” (కీర్తన. 91:1,2).
దావీదు తన యొక్క జీవితకాలమంతయును శాశ్వతుడైన దేవుని తన యొక్క ఆశ్రయస్థలముగా కలిగియుండెను. తన యొక్క సొంత బలమునే గాని, విల్లు యోధుల్నే గాని, రథములను గాని, గుర్రములను గాని ఆయన నమ్మి ఉండలేదు. వారిని గూర్చి ఆయన అతిశయించనులేదు. దావీదునకు కూడా ఆ బండయైయున్న ఆశ్రయస్థలము యొక్క ఔన్నత్యము ఏమిటని ఎరిగి ఉండెను. ఆయన వ్రాయుచున్నాడు, “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ….. ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును” (కీర్తన. 27:5).
శాశ్వతుడైన దేవుడు మహిమగల రెక్కలను మీపై విప్పి మిమ్ములను కప్పి హత్తుకుని యుండుటను మీ విశ్వాసపు కన్నులతో చూచెదరు. ఆయన యొక్క ప్రకాశవంతమైన నిత్యముగా నుండు బాహులతో మిమ్ములను ఎత్తి పట్టుకొనియున్నాడు. ఎవరు మిమ్ములను ఆయన యొక్క చేతిలో నుండి అపహరింప గలరు?
దావీదు వ్రాయుచున్నాడు, “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడిసముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము” (కీర్తన. 46:1 – 3).
దేవుని బిడ్డలారా, నోవాహుకును అతని యొక్క బిడ్డలకును, కుటుంబ సభ్యులందరికీను నివాసస్థలమునిచ్చిన, శాశ్వతుడైన దేవుడు నిశ్చయముగానే మీకును, తరతరములకును, మీయొక్క సంతతికిని ఆశ్రయస్థలమును, ఆధారమును దయచేయును.
నేటి ధ్యానమునకై: “నీవు బీదలకు బలముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండ ఆశ్రయముగాను, వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి” (యెషయా.25:3).
