Appam, Appam - Telugu

జూలై 22 – పరిశుద్ధాత్ముని యందు ఆనుకొనుడి

“క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము నన్ను పాపమరణముల నియమము నుండి  విడిపించెను”     (రోమీ. 8:2

ఒకసారి ఒక యవ్వనస్థుడు ఉజ్జివపు సదస్సునందు ఒక దానిలో పాల్గొనెను. సదస్సు ముగించబడిన వెంటనే, సదస్సును జరిపిన ఆ బోధకుని వద్ద పరిగెత్తుకొని వచ్చి, తన యొక్క సమస్యలను ఎత్తి చెప్పెను. అతని యొక్క ప్రధానమైన సమస్య పాపపు సమస్యయైయుండెను.   ‘నేను ఎంతగానో ప్రయత్నించి చూచుచున్నాను. నావల్ల ఈ పాపపు శోధనలను ఎందుకు జయించలేక పోవుచున్నాను?’  అని వేదనతో అడిగెను.

ఆ బోధకుడు అతని వద్ద,   ‘నీ యొక్క ప్రశ్నయందే జవాబు కలదు. నీవు చెప్పుచున్నప్పుడు నా యొక్క ప్రయత్నము అని చెప్పుచున్నావు. మనుష్యుని యొక్క ప్రయత్నము వలన ఎన్నడును పాపమును జయించలేము. నీఅంతట నీవు చేయుచున్న సొంత ప్రయత్నమును విడచిపెట్టి, ఎల్లప్పుడును పరిశుద్ధాత్ముని యొక్క బలమునందు ఆనుకుని ఉండుము.  ‘శక్తి చేతను కాదు, బలము చేతను కాదు ఆత్మవలనే జరుగును’   అని  ‘ప్రభువు సెలవిచ్చియున్నాడు కదా’ అని చెప్పెను.

చూడుడి! సహజముగానే గాలిలో ఉన్న ఎట్టి వస్తువునైనను తన వైపునకు ఆకర్షించు కొనేటువంటి గురుత్వాకర్షణ శక్తి భూమికి కలదు. రాయిని గాలిలో విసిరినను క్రింద నేలపైకొచ్చి పడును. రేకును పడవేసినను నేలపైకొచ్చి పడును. ఎట్టి వస్తువును పడవేసినను క్రిందకు నేలపైకి లాగి వేయుచున్నది. అది ప్రకృతియొక్క నియమము.  ఇదే విధముగా పాపమును, పాపపు ఇచ్ఛలును మనుష్యుని ఆకర్షింప చేయుచున్నది. సాతానును అతని దూతలును పాతాళపు వైపునకు ఈడ్చుచున్నారు.

నేను క్రిందకు పడిపోవుచునే ఉండవలెనా? గురుత్వాకర్షణ శక్తికి  నేను బానిసగానే ఉండవలెనా అని మీరు అడగవచ్చును. అయితే మీకు ఒక రహస్యమును చెప్పుచున్నాను. ఒక విమానమును చూడుడి. దరిదాపులు వెయ్యి మంది ప్రయాణము చేసేటువంటి పెద్ద విమానములు ఉన్నాయి.  ప్రయాణికుల యొక్క మూట, ముడ్ళు, పెట్టే పరుపులు ఇంకా, అది ఎగురుటకు కావలసిన వేల సంఖ్యల లీటర్ల పెట్రోలు అన్నిటిని తనలో పెట్టుకొని గురుత్వాకర్షణ శక్తికి ఒక టాట చూపించి పైకి ఎగసి చక్కగా ఎగురుచున్నది.

ఎందుకని ఈ విమానమును గురుత్వాకర్షణ శక్తి ఏమియు చేయలేకపోవుచున్నది? గురుత్వాకర్షణ శక్తి విమానమును క్రిందకు లాగి వేయుటకు ప్రయత్నము చేసినను, విమానమునందుగల ఇంజను బహువేగముగా పనిచేయుచు గురుత్వాకర్షణ శక్తి కంటే అధిక సారవంతమైన శక్తిని కలిగి పైకి ఎగసి వెళ్ళుచున్నది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే విమానము ఎగసి ఎగురుచున్నది.

ఒక విమానమునకు ఇంజను ఉండునట్లుగానే పరిశుద్ధాత్ముడు మీయందు ఉన్నాడు. ఆయన పరలోకపు ఇంజను. పరలోకపు పావురమైన వాడైయున్నాడు. ఆయన ఒక మనుష్యునిలో నివాసము ఉన్నప్పుడు, పాపము యొక్క ఆకర్షించు శక్తిని దాటుకొని, అతనిని ఉన్నతములకును, మహోన్నత స్థలములకును ఎగసి ఎగురునట్లు సహాయము చేయును. పాపములే గాని, క్షణికమైన సుఖములే గాని మిమ్ములను ఇక బానిసత్వమునందు ఉంచనేరదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏసుని వలన జీవముగల ఆత్మ యొక్క శక్తి పాపపు నియమముల నుండి మిమ్ములను విడుదల చేసియున్నది.

నేటి ధ్యానమునకై: “శరీరము ఆత్మకు విరోధముగాను ఆత్మ శరీరమునకు విరోధముగాను  అపేక్షించును; ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు”    (గలతి. 5:17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.