No products in the cart.
జూలై 18 – నిజమైన ఒప్పుకోలు!
“ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు” (లూకా. 5:5).
లోతుల్లోనికి వెళ్లి ప్రభువు యొక్క అద్భుతములను ఆశ్చర్య కార్యములను చూడవలెనా? మొట్టమొదటిగా ప్రభువు వద్ద మీ యొక్క నిజమైన స్థితిని ఒప్పుకొనుచు మిమ్ములను సమర్పించుకొనుడి.
ఎల్లప్పుడును ప్రభువు వద్ద మీ యొక్క చేతకానితనమును ఒప్పుకొనుచున్నారా, అప్పుడే ప్రభువు యొక్క హస్తము మీ యొక్క జీవితమునందు తారసపడుటకు ప్రారంభించును. పేతురు తన యొక్క సొంత ప్రయత్నమునందు ఓటమి పొందుటను మనసారా ప్రభువు వద్ద తెలియజేయుటను తలంచి చూడుడి.
పేతురు చేపలు పట్టుటను తన యొక్క పారంపర్య వృత్తిగా కలిగియుండెను. ఆయనే తన యొక్క చేతకానితనమును, శూన్యతను, ఓటమిని మనసారా ప్రభువు వద్ద ఒప్పుకొనుటను చూడుడి. రాత్రంతయు ప్రయాసపడితిని అని చెప్పుచున్నాడు. రాత్రి సమయమే చేపలు పట్టుటకు తగిన సమయము. ఆ దినములయందు చేపలు పట్టువారు రాత్రి సమయమునే ఆ పనికై ఎంచుకొనిరి (యోహాను. 21:3).
పేతురు మనసారా తన యొక్క ఓటమిని క్రీస్తు వద్ద ఒప్పుకొనుచున్నప్పుడు ప్రేమతో ‘ఏలినవాడా’ అని పిలచుచున్నాడు. ఒక యజమానుని వద్ద దాసుడు మాట్లాడుచున్నట్లు తన్ను తాను తగ్గించుకొని మాట్లాడటమును గమనించుడి. ఆంగ్లభాష బైబులు గ్రంథమునందు ఏలినవాడా అను పదమునకు. ‘యజమానుడా’ అని భాషాంత్రము చేయబడియున్నది. అవును, క్రీస్తే మనకు బోధకుడిగాను, యజమానునడుగాను ఉన్నాడు.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు” (మత్తయి. 23:8).
లోతైన క్రైస్తవ జీవితము అనుట క్రీస్తునే సమస్తమునకు మార్గదర్శిగా ముందు పెట్టుకొనుటయైయున్నది. మనము పరిపూర్ణముగా నమ్మి వెంబడించవలసిన అద్భుతమైన ఒకే మాదిరి యేసుక్రీస్తు యైయున్నాడు. ‘ఏలినవాడా’ అని పిలుచుటయందు గల వాస్తవమైన అర్థము, ‘నీవు ఉన్నతుడవు, మహోన్నతడవు, నాకు మార్గము చూపించగలవాడు, నేను నీ వలన సృష్టింప బడినవాడను, నీవే నన్ను సృష్టించిన వాడవు’ అనుటయైయున్నది.
పేతురుతో మాట్లాడుచున్నవాడు, ఆ సమాజమునే సృష్టించినవాడు. చేపలు లేని స్థలములయందు నూతనముగా చేపలను సృష్టించుటకు శక్తిగలవాడు. చేప నోటీలో నుండి షేకెలును తీసి అద్భుతమును చేయదగినవాడు.
పేతురు యొక్క ఒప్పుకోలుయందు అతని యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి చూచుటతో పాటు, క్రీస్తునకు ఎంతటి గొప్ప ఔన్నత్యమైన స్థితిని తన యొక్క అంతరంగమునందు కలిగియుండెను అను సంగతిని మనము ఎరుగుచున్నాము. దేవుని బిడ్డలారా, అలాగునే మీరును మీయొక్క సమస్త అంశముల యందును ప్రభువునందు మనస్సును తెరచి చెప్పుదురు గాక. ఆయన మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించి నడిపించును. అవును! ఆయన గొప్పవాడు, శక్తిగలవాడు!
నేటి ధ్యానమునకై: “ఓడలెక్కి, సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయుచున్నారే, వారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి” (కీర్తనలు. 107:23,24).