Appam, Appam - Telugu

జూలై 13 – ఆత్మమూలముగా విశ్రాంతి

నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు”  (యెషయా. 28:11)విశ్రాంతి యొక్క విధానములను బైబిలు గ్రంధము బహు చక్కగా మనకు బోధించుచున్నది. సిలువ మూలముగా వచ్చు విశ్రాంతి కలదు. ప్రభువు యొక్క వాక్యము మూలముగా వచ్చు ఆధరణయు, ఓదార్పును కలదు. దేవుని సముఖమునందు వచ్చు విశ్రాంతియు కలదు. అన్నిటికంటే మిన్నగా దేవుడు పరిశుద్ధాత్మ మూలముగా మనకు విశ్రాంతిని ఆజ్ఞాపించుచున్నాడు.

నాకు తెలిసిన ఒక వ్యక్తి తన జీవితమునందు సమస్య వచ్చుచున్నప్పుడల్లా వాటితో పోరాడుచు ఉండక, ఏకాంతమునందు ఒక స్థలమును వెతికి వెళ్లి ప్రభువుతో సంభాషిస్తూ ఉండును.  ఉదయకాల సమయమునందు అన్య భాషతో మాట్లాడి, ప్రభువును స్తుతించుచునే ఉండును.

అన్య భాషతో మాట్లాడుచున్నప్పుడు అది పరలోకమును తరచి ఇచ్చుచున్న అద్భుత ద్వారముగా ఉన్నది. అప్పుడు ప్రభువు యొక్క సింహాసనమును, ఆయన యొక్క  ఏలుబడిని తేరి చూచెదను. సమస్త భక్తి కంటే దైవీక విశ్రాంతి నదివలె నా హృదయమును నింపుచున్నది” అని ఆయన చెప్పుట అలవాటు.

నత్తివారి పెదవులతోను, అన్యభాషలతోను మాట్లాడుచున్నప్పుడు, అది ఎట్టి అలసిపోయిన  మనస్సును కూడా విశ్రమింప చేయుచున్నది. అన్య భాషలను మాట్లాడుచున్నవాడు, దేవునితో మర్మములను మాట్లాడుచున్నాడు. అన్యభాషలో మాట్లాడగా మాట్లాడగా భక్తియందు అభివృద్ధి కలుగుచున్నది. దైవీక ఆదరణను, సమాధానమును అందజేయుచున్నది. పరిశుద్ధ ఆత్ముని ద్వారా అట్టి అమూల్యమైన  యీవును మనము పొందుకొనుచున్నప్పుడు, దైవిక సమాధానము మనలోనికి దిగి వచ్చుచున్నది. మన యొక్క యుద్ధములను మనము చేయక, ప్రభువే మనకొరకు యుద్ధమును చేయునట్టుగా ఆయన యొక్క హస్తములకు అప్పగించెదము.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” ‌ (రోమీ. 8:26)

ఆత్మలో ఆనందించుటయే యేసుక్రీస్తు యొక్క అనుభవమై ఉండెను (లూకా.10:21). ఆయన చుట్టూతా ఎల్లప్పుడును నేరమును మోపు మనుష్యులు ఉండెను. పరిసయ్యులును, సదుకయ్యులును, ఆయనను చంపుటకై  మనస్సైయుండిరి.  అంతటి క్రూరమైన వారి మధ్యను యేసు ఆత్మలో ఆనందించుచూనే ఉండెను.  అందుచేతనే సమస్యల మధ్యలోను ఆయన సమాధానమును, సంతోషమును గలవాడై పరిచర్యను చేసి ముగించెను.

దేవుని బిడ్డలారా, మీయందు ఆత్మ యొక్క నింపుదలను తీసుకొని వచ్చుటకు కోరుచున్న పరిశుద్ధాత్ముడు, మీలో నివాసము ఉండుటకు కోరుచున్నాడు. మీకు విశ్రాంతిని దయచేయుటకు కోరుచున్నాడు. మీయొక్క అంతరంగమును పరలోకపు పావురమైయున్న పరిశుద్ధాత్మునికి తెరచి ఇచ్చెదరా?

నేటి ధ్యానమునకై: “యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొంది, పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు;  వారు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు”    (యెషయా. 40:31).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.