Appam, Appam - Telugu

జూన్ 28 – “యేసుతోకూడా ఉండినవారు!”

“వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు,… వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి” (అపో.కా. 4:13).

పేతురును యోహానును మాట్లాడిన ధైర్యమును జనులు చూచిరి. వారు మాట్లాడుచున్నప్పుడు బయలు పరచబడుచున్న శక్తిని చూచిరి. వారు మాట్లాడుచున్నది విన్న ప్రజల హృదయమునందు నొచ్చుకున్న బడినవారై, జనులు ఏమి చేయవలెనని విలపించి అడిగిరి. వారు విద్యా జ్ఞానము లేనివారును, తెలివి లేని వారిగా ఉండినప్పటికిని, యేసుతోకూడా ఉండినవారు అని అప్పుడు ప్రజలు గుర్తిరిగిరి.

మీరు యేసుతో కూడా ఉండుటయే మీయొక్క ఔన్నత్యము. అదియే మిమ్ములను ప్రత్యేకమైన వారిగా చేయును. మీరు పేదవారిగాను, తెలివి లేనివారిగాను ఉండవచ్చును. అయితే యేసుతో ఉండినట్లయితే మీరు ప్రత్యేకమైన వారిగా ఉందురు. ప్రభువుతోపాటు ఉండిన మోషే యొక్క ముఖము ప్రకాశించినట్లు మీయొక్క జీవితము కూడాను, పరిచర్య కూడాను ప్రకాశించును.

కొంతమంది బలమైన సేవకులు ప్రసంగించుచున్నప్పుడు, వారిని చూచి ఆశ్చర్యపడుచున్నాము. వారి వలె అద్భుతములను సూచక్రీలను చేయకపోమా అని తపించుచున్నాము. వారి యొక్క శక్తికి గల రహస్యము వారి యొక్క విద్య వలనైనను, వాక్చాతుర్యమువలనైనను కాక వారు యేసుతో కూడా ఉండుట చేతనే ఉన్నది. మీరు యేసుతోపాటు ప్రార్థనయందును, ధ్యానమునందును గోజాజుటయందును అధిక సమయమును ఖర్చుపెట్టినట్లయితే ప్రభువు మిమ్ములను కూడాను శక్తివంతముగా వాడుకొనును. మిమ్ములను కూడాను అగ్నిజ్వాలలుగా మార్చును.

పూలదండలో ఉన్న దారము సువాసనను వెదజల్లుచున్నట్లు; కవీశ్వరుని ఇంటి కటిక నేల కూడాను కవితను పాడును అని చెప్పుదురు. అయస్కాంతముతో ఉంచబడిన ఇనుమును, తాను కూడా అయస్కాంత శక్తిని పొందుకొనుట లేదా? సూర్యుని తదేకముగా చూచి చుట్టివచుచున్న చంద్రుడు కూడాను సూర్యుని యొక్క కాంతి చేత రాత్రి సమయములయందు ప్రకాశించుట లేదా? మీరు యేసుతో కూడా ఖర్చు పెట్టుచున్న సమయము ఆయన వద్ద నుండి సత్తువను, శక్తిని, బలమును పొందుకొనుచున్న సమయముగా ఉండును.

ఒక వయస్సు మళ్ళిన వృద్ధురాలిని నేను ఎరుగుదును. వారు ఎల్లప్పుడును ప్రార్ధించుచూనే ఉండుటచేత ప్రభువు వారికి బహు చక్కటి ప్రవచన వరమును దయచేసి ఉండెను. వారికి విద్యా జ్ఞానమును లేకుండా ఉండినప్పటికీని, గొప్ప గొప్ప అధికారులను, వక్కీలను, వ్యాపారస్తులను ప్రభువు లోనికి త్రోవ నడిపించిరి. వారు ఎల్లప్పుడును ఒక స్తంభము చెంతన చాప వేసుకుని కూర్చుండి ప్రార్థించుచూనేయుందురు.

ఆ స్థంబమును ప్రభువు యొక్క పాదముగా ఎంచుకొని ప్రార్థించుదురు. పలు సమయములయందు ప్రార్థించలేని బలహీనతలు ఆవరించినప్పటికిని, ప్రభువు యొక్క పాదము చెంతనే మౌనముగా కూర్చుండి ఆయన యొక్క ముఖమును చూచుచునే ఉందురు. ప్రభువు కూడాను తన యొక్క మధురమైన ప్రసన్నత చేత వారిని ఆనందింప చేయును.

దేవుని బిడ్డలారా, ఈ విధముగా మీరు కూడాను ప్రభువుతో ఉండువారు, చివరి బూర ధ్వనించ బడుచున్నప్పుడు, మేఘములపై ఆకాశమునందు కొనిపోబడి, నిశ్చయముగానే ఎల్లప్పుడును ప్రభువుతో కూడా ఉందురు.

నేటి ధ్యానమునకై: “తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను” (ప్రకటన. 17:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.