No products in the cart.
జూన్ 27 – “ఏమైనను!”
“ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను” (మార్కు. 9:22).
ఒక తండ్రి తన కుమారుని పట్టి పీడించుచున్న అపవిత్రాత్మ నుండి విడుదలను పొందుకొనునట్లుగా అతనిని శిష్యుల వద్దకు తీసుకొని వచ్చెను. ఆ అపవిత్రాత్మ ఆ చిన్నవానిని తరచుగా పట్టిపీడించుచూనే ఉండెను. శిష్యులు దానిని వెళ్ళగొట్టలేక పోయిరి.
యేసుక్రీస్తుని వద్ద ఆ తండ్రి : “ఏమైనను నీ వలనయైయితే….” అని ప్రేమతో చెప్పుచున్న సంగతిని చూచుచున్నాము. ఇతనిని మనుష్యుల వద్దను తీసుకుని వెళ్లలేడు. వైద్యుల వద్దను తీసుకుని వెళ్లలేడు. ఎట్టి వైద్యము ద్వారాను, మందుల ద్వారాను, మాత్రల ద్వారాను దయ్యమును వెళ్ళగొట్ట గలడు? యేసు యొద్ద శక్తిగలదు అనుటను విశ్వసించి ఆ తండ్రి నమ్మికతో అడిగెను.
మన దేవుడు సర్వశక్తిమంతుడు (ఆది.కా. 17:1). ఆయన సమస్తమును చేయగలడు (యోబు. 42:2). బలము దేవునిది (కీర్తనలు. 62:11). ఆయనకు అసాధ్యమైనది ఏమియు లేదు (యిర్మియా. 32:27).
మీరు ప్రభువుపై విశ్వాసమును ఉంచుడి. మీయొక్క సమస్యలను, పోరాటములను మీయొక్క ప్రార్థనలోనికి తీసుకొని రండి. ప్రభువు నిశ్చయముగానే మీయొక్క ప్రార్ధనను త్రోసి వేయనివాడు. మీ యొక్క విజ్ఞాపనలను నిరాకరించనివాడు. ఆయన వద్ద బహువిస్తారమైన కృపయు, కనికరమును కలదు. తండ్రి తన కుమారుని కనికరించినట్లు ఆయన నిశ్చయముగానే మిమ్ములను కనికరించును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: ఆయన మీకు అద్భుతములను కనబరుచును (మీకా. 7:15). ఆయన క్రియలోను వాక్యములోను శక్తిగలవాడు (లూకా. 24:19). ఆయన మీ కొరకు సమస్తమును చేసి ముగించుచున్నాడు (కీర్తనలు. 138:8).
“ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుము. ఇంతవరకు మనుష్యుల యొక్క సహాయమును వెంటాడాము. ఇప్పుడు నిన్ను దృఢముగా పట్టుకున్నాము’ అని ఆ తండ్రి యేసుక్రీస్తును తేరి చూచి పిలుచుటకు ప్రారంభించెను. అప్పుడు యేసుక్రీస్తు ఆ అపవిత్రాత్మను గద్దించెను.
‘మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము’ అని యేసు ఆజ్ఞాపించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను (మార్కు.9:25,27).
దేవుని బిడ్డలారా, మీ యొక్క సమస్యలు ఏమిటి? నేడు మీ ఎదుట నిలబడుచున్న సాతాను యొక్క వ్యతిరేకతలు ఏమిటి? ప్రభువు వద్దకు రండి. ‘మమ్ములను కరుణించి మాకు సహాయము చేయుము’ అని వేడుకొనుడి. నిశ్చయముగానే ప్రభువు అద్భుతమును చేయును.
దావీదు చెప్పుచున్నాడు: “ఇక్కట్లలో మాకు సహాయము చేయుము; మనుష్యుల సహాయము వ్యర్థము (కీర్తనలు.108:12). మనుష్యుడు సహాయము చేసెదను అని చెప్పి సహాయము చేయక మానివేయును. అయితే, ప్రభువు మీ యొక్క ప్రార్థనను విని మీ యొక్క జీవితమునందు నిశ్చయముగానే ఒక అద్భుతమును చేయును.
నేటి ధ్యానమునకై: “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్తనలు. 46:1)