No products in the cart.
జూన్ 11 – జ్ఞానము యొక్క సువాసన!
“మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము” (2. కోరింథీ. 2:14).
క్రీస్తును ఎరిగేటటువంటి జ్ఞానమును గూర్చిన సువాసన అనునది, ఒక ఆశ్చర్యకరమైన సువాసనయైయున్నది. అది అపురూప మైనదియును, గొప్ప ఔన్నత్య మైనదియునైయున్నది. ప్రభువు మన ద్వారా ఆయనను ఎరిగేటటువంటి జ్ఞానము యొక్కసువాసనను బయలుపరచుచున్నాడు. ఆ సంగతిని గూర్చి సంతోషించిన, అపో. పౌలు: ‘మా ద్వారా ప్రతి స్థలముందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచున్న దేవునికి స్తోత్రము’ అని చెప్పి ప్రభువు యొక్క నామమును మహిమ పరచుచున్నాడు.
థమస్కు మార్గమునందు ప్రభువు, అపో. పౌలును స్పందించినప్పుడు, మొదటిగా ఆయన హృదయమునందు తోచినదల్లా ‘ప్రభువా, నీవు ఎవరివి?’ అను గొప్ప లోతైన ప్రశ్న (అపో.కా. 9:5). ఆయన ఎవరని తెలుసుకునుటకు మన యొక్క పూర్తి ఆయుషు సరిపోదు. అయినను, ఆయనను ఎరగవలెనని. అపో. పౌలు తీర్మానించుటచేత ప్రభువు మొదటిగా ఆయనకు తన్ను తాను బయలుపరచినప్పుడు, “నేను నీవు హింసించుచున్న యేసును” అని చెప్పెను (అపో.కా. 9:5). దేవుడు గొప్ప ప్రేమగలవాడు, కనికరముగలవాడు, వెలుగైయున్నవాడు, మార్గమునైయున్నవాడు, గుమ్మమునైయున్నవాడు. సత్యమునైయున్నవాడు, జీవమునైయున్నవాడు. అదే సమయమునందు, సౌలు అను పౌలుచే ఇన్సింప బడినవాడుగాను ఉన్నాడు.
అపో. పౌలు ఇట్టి ప్రత్యక్షతతో నిలిచిపోక, మరియు దేవుని ఎరుగుటకు ఆశించెను. “నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణము విషయములో సమానాను భవముగలవాడనై, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను” (ఫిలిప్పీ. 3:8,10,11) అని ఆయన సూచించుచున్నాడు.
మీరు ప్రభువును ఏ స్థాయికి ఎరగవలెనని కోరుచున్నారు. ఆ స్థాయికి ప్రభువునకు ఇంపైన సువాసనను వీచుదురు. అపో. పేతురు ఆ సంగతిని గూర్చి వ్రాయుచున్నప్పుడు, “తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును, దైవభక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున ” (2 పేతురు. 1:2) అని సూచించెను.
క్రీస్తును ఎరిగేటువంటి జ్ఞానము వలన మనకు వచ్చుచున్న ఆశీర్వాదములు లెక్కించలేనివి. అందులో జీవమునకును, దైవభక్తికిని కావలసిన అన్నిటిని మనము పొందుకొనుచున్నాము. ఆయన యొక్క దివ్య శక్తిని పొందుకొనుచున్నాము. నిత్య జీవమును పొందుకొనుచున్నాము. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును” (2. పేతురు. 1:8).
“ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును” (2. పేతురు. 2:20) అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.
దేవుని బిడ్డలారా, ప్రభువును ఇంకను అత్యధికముగా తెలుసుకొనుటకు ప్రయత్నించుదురా? ఇంకను నిన్ను నేను ఎరుగవలెను, ఇంకను సమీపించి చేరవలెను అను తపనతో సువాసనను వీచుదురా?
నేటి ధ్యానమునకై: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి”. (2. పేతురు. 3:18).