No products in the cart.
జనవరి 16 – శుద్ధ హృదయము!
“దేవా, నాయందు శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును (ఆత్మను) నూతనముగా పుట్టించుము” (కీర్తనలు. 51:10).
తన పాపములకు కొరకు పశ్చాత్తాపబడి ఏడ్చి క్షమాపణను కోరుచున్న దావీదు ప్రభువు వద్ద: “దేవా, శుద్ధ హృదయమును నాయందు కలుగజేయుము” అని చెప్పి ప్రార్థించెను. ఈ మాటలను ధ్యానించి చూడుడి! శుద్ధ హృదయము అను మాటను ఆంగ్లమునందు Clean heart, Pure heart అని భాషాంత్రము చేయబడియున్నది.
పలు సంవత్సరముగా ఒక కది మూతవేయబడి ఉండినందున ఆ గది అంతయు దుమ్ముతోను, ధూళితోను, మురికితోను నిండినదై కనబడును. అట్టి గదిని ఊడ్చి, కడిగి శుభ్రపరిస్తేనే గాని అందులో ఉండగలము.
అదేవిధముగా ఒక మనుష్యుని యొక్క హృదయము పాపపు జీవితము వలన నిండి, దేవునికి చోటు ఇవ్వక, పలు సంవత్సరములు మూతవేయబడి ఉండుట చేత, అందులో అపవిత్రత నిండి ఉండును. పాపపు ఒప్పుకోలు ద్వారా దానిని మనము ఊడ్చి, యేసుని రక్తము ద్వారా కడిగి, పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా ఆ గదిని రూపాంతరము పరిచిన తర్వాత పరిశుద్ధ జీవితములోనికి ప్రవేశించుచున్నాము.
మీ యొక్క జీవితము పవిత్రముగాను, పరిశుభ్రముగాను ఉండవలెను అంటే, మొట్టమొదటిగా, మీ యొక్క హృదయము శుద్ధీకరించ బడవలెను. శుద్ధ హృదయమును పొందుకొనవలెను అంటే, మీ యొక్క హృదయము దేవుని యొక్క మాట చేత నింపబడవలెను. ప్రభువు యొక్క వాక్యానుసారము జీవించుటకు ఎవరైతే తన్నుతాను సమర్పించుకొందురో అట్టివారికి సహాయము చేయుటకు పరిశుద్దాత్ముడు ముందుకు వచ్చుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యౌవనస్థులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టియె తన్నుతాను జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?” (కీర్తనలు. 119:9)
రెండోవదిగా, పరిశుద్ధ జీవితమునకు పవిత్రమైన కన్నులు కూడాను అత్యవసర మైనదైయున్నది. “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును?” (యోబు. 31:1) అని యోబు అడుగుచున్నాడు. “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” (మత్తయి. 5:28). మీ కన్నులు నీ ప్రాణమును మలినపరచుటకు చోటు ఇవ్వకుడి.
మూడోవదిగా, పరిశుద్ధమైన జీవితమునకు పరిశుద్ధమైన చేతులు కావలెను. అపవిత్రమైన దానిని మొట్టకుడి అని (2. కొరింథీ. 6:17) లో మనము చదువుచున్నాము. పరిశుద్ధమైన చేతులను పైకెత్తి ఎల్లప్పుడును ప్రభువును స్తుతించవలెను!
నాలుగోవదిగా, పరిశుద్ధమైన జీవితమునకు పరిశుద్ధమైన శరీరము కావలెను! బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి” (రోమీ.12:1). శరీరము జారత్వమునకు కాదు గాని, అది ప్రభువు ఎదుట పవిత్రముగా కనబడవలెను.
అందుచేత జారత్వమునకు తొలగి పారిపోయి శరీరమును కాపాడుకొనుడి (1. కొరింథీ. 6:18). “మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది; గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు” (1. కొరింథీ. 6:18). దేవుని బిడ్డలారా, చావునకు హేతువైన మీ శరీరమును పాపము ఏలకుండును గాక.
నేటి ధ్యానమునకై: “ఆయనయందు ఇట్టి నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును, ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్నుతాను పవిత్రునిగా చేసికొనును” (1. యోహాను. 3:3).
