Appam, Appam - Telugu

జనవరి 07 – నిన్ను కాపాడును

“నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము; నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము” (కీర్తనలు. 25:20).

“కాపాడును నిన్ను కాపాడును. కాపాడువాడు కాపాడును, ఇకను ఇక పైనను కాపాడును. కలతచెందకు మనసా” అను పాటను పాడుచున్నప్పుడెళ్లను నా హృదయము ప్రభువును అత్యధికముగా ఆనుకొనును. అవును, ప్రభువు మనలను కాపాడువాడు.

ఒక కోడిపెట్ట అనునది తాను పొదుగుండి పొదిగించిన కోడి పిల్లలను భద్రముగా కాపాడుటయందు ఎంత జాగ్రత్తగా ఉండును అన్న సంగతిని మీరు ఎరిగియుందురు. అది పొదుగుచున్నప్పుడే మనము మన యొక్క చేతులను వాటి చేరువనకు తీసుకొని వెళ్ళినట్లయితే కసుకుమని పొడిచివేయును. పిల్లలను కాపాడుట కొరకు పిల్లుల బారి నుండి గ్రద్దల బారి నుండి తల్లికోడ్ళు మూర్ఖముగా పోరాడును. అడవి మృగములు కూడాను అలాగునే. ఎలుగుబంటి తన పిల్లలకు హాని వచ్చుటను గుర్తించుచున్నది అంటే, ప్రాణాన్ని తెగించి వాటి పిల్లలను కాపాడును.

సాధారణమైన పక్షులు మరియు మృగములు మొదలగు వాటియొక్క అరచేతులలో తమ యొక్క లేత పిల్లలను, తమ పిల్లలను కాపాడుటకు అంతటి ప్రేమను బలమును ప్రభువు పెట్టియున్నట్లయితే, తన అంతరంగమునందు తన పిల్లలైయున్న మనలను కాపాడుటకు ఆయన ఎంత అత్యధికమైన కనికరమును, కృపను ఉంచియుండును అనుసంగతిని కొద్దిగా ధ్యానించుచూడుడి.

మీకు విరోధముగా విస్తారమైన శత్రువులు వచ్చుచున్నారా? కలత చెందకుడి, ప్రభువు మిమ్ములను కాపాడును. రోగశయమునందు, బలహీనత చెందిన సమయములో ఉండినప్పటికిని కలత చెందకుడి. ప్రభువు మిమ్ములను కాపాడును. పోరాటముపై పోరాటము వచ్చి, నశించిపోవుదునేమో అని తలంచుచున్నారా? కలత చెందకుడి ప్రభువు మిమ్ములను కాపాడును.

కొన్ని వాగ్దానములను ప్రభువు మీకు ఇచ్చుటకు కోరుచున్నాడు. వాటిని దృఢముగా పట్టుకొనుడి. అంత మాత్రమే కాదు, ప్రభువును ఎల్లప్పుడును ఆనుకొనుడి. “యెహోవా నామము బలమైన దుర్గము; నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును” (సామెతలు. 18:10) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.

ప్రభువు కంటి పాపవలె మనలను కాపాడును. (కీర్తనలు.17:8). మన మార్గములన్నిటిలో ఆయన మనలను కాపాడును (కీర్తనలు. 91:11). నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడును (2. తిమోతి. 1:12). మనలను పూర్ణశాంతి గలవారిగా కాపాడును. (యెషయా. 26:3).శోధన కాలములో ఆయన మనలను కాపాడును (ప్రకటన. 3:10). తొట్రిల్లకుండ మనలను కాపాడును. (యూదా. 1:24). సమస్త దుష్టతములో నుండి మనలను కాపాడును (యోహాను. 17:15).

ఇట్టి వాగ్దానములన్నియును ప్రభువు మీకొరకు సొంతముగా ఇచ్చియున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మకస్థుడు ఆయన చివరి వరకు మిమ్ములను కాపాడుటకు శక్తి గలవాడు. కీర్తనలు. 23, 91, 121 అను వాటిని మరలా మరలా చదివి చూడుడి. వాటియందుగల వచనములను నోరు తెరిచి ఒప్పుకోలు చేయుడి. వాటియందు గల వాగ్దానములను హక్కున చేర్చుకుని సొంతము చేసుకొనుడి.

దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు దేవుని యొక్క రెక్కల క్రింద నిత్యానిత్యముగా కాపాడబడుదురు.

నేటి ధ్యానమునకై: “యెహోవాయే నిన్ను కాపాడువాడు; నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు” (కీర్తనలు. 121:5,6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.