No products in the cart.
ఏప్రిల్ 16 – నేను నీకు తోడైయున్నాను!
“నీకు తోడైయున్నాను భయపడకుము; నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము; నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను; నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” (యెషయా. 41:10).
ప్రవక్తయైన యెషయా యొక్క ప్రవచనపు వచనము మిగుల శ్రేష్టమైనది. అది నేడును మన అంతరంగమును ఆదరించుచు ఓదార్చుచున్నది. ప్రభువుపై సంపూర్ణముగా ఆనుకుని ఆయనను వెంబడించునట్లు మనలను పూరికొలుపుచున్నది.
నేడు అనేకులను పీడించుచున్న ఒక సమస్య ఒంటరితనమైయున్నది. తల్లిదండ్రులు పిల్లలను విడిచి వంటరిగా జీవించుచున్నారు. ఉద్యోగము నిమిత్తము భర్త ఒక స్థలమునందును, భార్య ఒక స్థలమునందును జీవించుచు ఒంటరితనమునందు వేదనపడుచు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధ బిడ్డల యొక్క జీవితమునందు ఎంతటి ఒంటరితనము, ఎంతటి విరక్తి!
ఒంటరితనము అనుట వేరు, వంటరి భావము అనుట వేరు, ఒంటరితనము అనుట వంటరిగా ఎట్టి తోడును లేక ఒంటరిగా నిలబడి ఉండుటైయున్నది. అయితే, వంటరి భావము అనుట అనేకులతో కలిసి జీవించినను, ఎవరి చేతను ప్రేమించబడక విరక్తితో జీవించుచున్నప్పుడు ఏర్పడుచున్నదైవున్నది.
కొందరు, ‘సింహపు గృహలో దానియేలు ఒంటరిగా నిలబడినట్లు, ఉన్నవారు మరియు బంధువుల మధ్యలో ప్రేమ కొరకు తపించు ఏకాకిగా నేను నిలబడుచున్నాను’ అని చెప్పుచున్నారు.
ప్రభువు ఎన్నడును మనలను దిక్కులేని వారిగా విడిచిపెట్టడు. మన యొక్క హృదయము సొమ్మసిల్లి పోవుచున్నప్పుడల్లాను, బుదిగంతములలో నుండి ఆయనను తేరి పిలుచున్నప్పుడు, మనకు అందని ఎత్తయిన బండ పైకి మనలను తీసుకుని వెళ్లి నిలబెట్టుచున్నాడు.
ప్రేమగల పరలోకపు తండ్రి ఎన్నడును మనలను విడిచి ఎడబాయిట లేదనియు, చేయి విడిచి పెట్టుట లేదనియు వాగ్దానము చేసియున్నాడు కదా. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు, యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును” (కీర్తనలు. 103:13).
యాకోబు తన ఇంటిని విడిచి ఏశావునకు భయపడి పారిపోయినప్పుడు ఒంటరి భావము ఆయనను పీడించి యుండును. ఒంటరిగా ప్రయాణము చేసినప్పుడు మార్గమునందు ఎవరు తనకు తోడుగా ఉండును అని కలతచెందియుండును.
అయితే, ప్రభువు చక్కటి దర్శనమును దయచేసెను. బైబిలు గ్రంధము సెలవిచ్చున్నది: “అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి” (ఆది.కా. 28:12).
ప్రభువు నిచ్చెన మెట్లను చూపించి, నిచ్చెనుకుపైగా నిలబడి యాకోబుతో కూడా మాట్లాడినప్పుడు, యాకోబు యొక్క కలవరమును భయమును తొలగిపోయెను. ప్రభువు చెప్పుచున్నాడు, “ఇదిగో, చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి” (యెషయా. 49:16).
దేవుని బిడ్డలారా, మీరు ఎన్నడను ఒంటరిగా ఉండట లేదు ప్రభువు మీతో కూడా ఉన్నాడు.
నేటి ధ్యానమునకై: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను; నీవు నాకు తోడైయుందువు; నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును” (కీర్తనలు. 23:4).