Appam, Appam - Telugu

ఆగస్టు 07 – “నీవు కోరినట్టే….!”

“నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే  ఆమె కుమార్తె స్వస్థతనొందెను”    (మత్తయి.15: 28) 

నీతిమంతుడు ఆశించినది అతనికి దొరుకును. నీతిమంతుని యొక్క కోరిక క్షేమకరమైనది అని సామెతల గ్రంథమునందు చదువుచున్నాము. నీతిమంతుని యొక్క కోరికలును, వాంఛలును దేవునికి ప్రీతికరముగా ఉంటున్నప్పుడు నిశ్చయముగానే వాటిని ప్రభువు నెరవేర్చును.

ఈ లేఖన భాగమునందు ఒక కనాను స్త్రీని గూర్చి  ఎరిగియున్నాము. ఆమె యొక్క కుమార్తె దురాత్మచే  పట్టబడి బహు భయంకరముగా పీడించబడుచున్నందున ఆమె యేసును వెతుక్కుంటూ పరిగెత్తుకొని వచ్చెను. మొదట ప్రభువు ఆమెకు చెవియోగక పోయినట్లు ఉండినను, అంతమునందు ఆమె యొక్క విశ్వాసమును చూచి మెచ్చుకొనుటతోపాటు,    “నీవు కోరినట్టే నీకు అవునుగాక” ‌ అని కనికరించి చెప్పెను. ఆ సమయమునందే ఆమె యొక్క కుమార్తె స్వస్థత పొందుకొనెను.

మీయొక్క హృదయపు కోరికలను, మనస్సు యొక్క వాంఛలను ప్రభువునకు తెలియజేయుడి. మీ కోరికలను మనస్సునందు దాచి ఉంచకండి. తండ్రి తన బిడ్డలను కనికరించినట్లు ప్రభువు తనపట్ల భయభక్తులువారిని కరుణించును.  మీ యొక్క వాంఛలు ప్రభువు యొక్క చిత్తప్రకారము ఉండినట్లయితే నిశ్చయముగానే ప్రభువు దానిని అనుగ్రహించును.  కొందరు మనస్సునందు పాపేఛ్ఛేలను పెట్టుకుని అంతరంగమందు చెడు తలంపుతో లోకపు బోగేఛ్చలను కోరుకొందురు.  అటువంటి వారికి ప్రభువు చెవియొగ్గక ఉండును. అయితే మీరు దేవుని యొక్క నామము మహిమ పరచబడునట్లు సత్యముతోను, యధార్థముగా వేటినెల్ల కోరుకొందరో, వాటినల్ల ప్రభువు మీకు నెరవేర్చి ఇచ్చును.

మా తండ్రిగారు ఆయన యొక్క పరిచర్య ప్రారంభపు దినములయందు   “అనుదిన మన్నా”  పత్రికను ఒక అతిపెద్ద ముద్రణా కార్యాలయమునందు ముద్రించుచు వచ్చెను. ఒక దినమున ఆయన ఆ ముద్రణా కార్యాలయమునకు వెళ్ళినప్పుడు ప్రభువు ఆయనలో ఒక వాంఛను కలిగించెను.   ‘ఆ ముద్రణా కార్యాలయమును ప్రభువు నాకు సొంతముగా ఇచ్చినట్లయితే ఎన్నో ఆత్మీయ పుస్తకములను ముద్రించవచ్చును కదా! ప్రభువు యొక్క నామము మహిమ పరచబడును కదా’  అని తలంచెను.  దానిని కొనుటకు కావలసిన వసతులు గాని, ధనము గాని ఆయన వద్ద కొంతైనను  లేకుండెను. అయితే ప్రభువునకు మాత్రము తన వాంఛను తెలియజేశెను.

కొన్ని మాసములు గడిచెను, ఒక దినమున ఆ ముద్రణా కార్యాలయము యొక్క యాజమాన్య వర్గము అయినను చూచుటకు వచ్చిరి.  ‘మేము మరొక్క వ్యాపారమునకు వెళ్ళుచున్నందున ఈ ముద్రణా కార్యాలయమును విడిచిపెడదాము అని తలంచుచున్నాము. మీకు కావలసినట్లయితే కొనుక్కొనుడి’  అని చెప్పిరి. నా వద్ద చాలినంత ధనము లేదు అని చెప్పినప్పుడు, కొద్ది కొద్దిగా  ఇచ్చి తీర్చుకొనుడి  అని చెప్పి ఉదారమైన మనస్సుతో ఇచ్చిరి.    “నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదుననెను”.    (1. సమూ.20:4)  అని ప్రభువు వాక్కునిచ్చియుండుట ఎంతటి వాస్తవము!

సొలోమోను యొక్క మనస్సు కోరుకున్న దానిప్రకారము జ్ఞానమును దయచేసినవాడు,  హన్నా యొక్క హృదయ వాంఛ చొప్పున ఆశీర్వాదకరమైన సమూయేలును దయచేసెను, ఎలీషా యొక్క హృదయ వాంఛ చొప్పున రెండంతల వరములను దయచేసెను. నిశ్చముయగానే మీయొక్క హృదయ వాంఛ చొప్పున దయచేయును.

నేటి ధ్యానమునకై: “యెహోవానుబట్టి సంతోషించుము; ఆయన నీ హృదయవాంఛలను తీర్చును”    (కీర్తన.37:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.