No products in the cart.
అక్టోబరు 26 – యెహేజ్కేలు!
“నేను దేశమును పాడుచేయ కుండునట్లు ప్రాకారమును దిట్ట పరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు” (యెహేజ్కేలు. 22:30).
నేడు మనము సంధించబోవుచున్న ప్రభువు యొక్క ప్రవక్తయైన యెహేజ్కేలు. యెహేజ్కేలు అను మాటకు యెహోవా యొక్క బలము అను అర్థమునైయున్నది. యాజకుడైన బూజీ కుమారుడు, అతిపెద్ద ప్రవక్తలు అని పిలువబడుచున్న యెషయా, యిర్మీయా, దానియేలు అను వారి వరుసలో ఈయన కూడా వచ్చుచున్నాడు. ఈయన సుమారు ఇరవైరెండు సంవత్సరములు కొనసాగించి ప్రభువు యొక్క పరిచర్యను చేసి ప్రవర్చించెను.
నా దినములయందు గల దేశములయొక్క పాపములకు తగిన దండన ఏమిటి అను సంగతిని, న్యాయ తీర్పు ఏమిటి అను సంగతిని ఈయన ముందుగా ప్రకటించెను. ఇశ్రాయేలు ప్రజల యొక్క చివరి విమోచనయు, యెరూషలేమునందు కట్టబడుచున్న దేవాలయమును గూర్చియు ప్రవర్చనముగా ప్రకటించెను. లోకము యొక్క అంతమునందు అంతిక్రీస్తు యెరూషలేమునకు వచ్చుచున్నప్పుడు, ప్రభువు ఏ విధముగా పోరాడును అను సంగతిని దిట్టముగాను స్పష్టముగాను జనములకు ప్రకటించెను.
ప్రవక్తయైన యెహేజ్కేలు నెబుకద్నెజరుచే చెర పట్టబడి బబులోనునకు కొనిపోబడెను. ఈయన యొక్క ప్రవర్చనములయందు ప్రభువు యొక్క ఖండింపును, వాత్సల్యమును బయలు పరచబడుచున్నది.
“ఇదిగో, మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయు వాడెవడో వాడే మరణము నొందును” (యెహేజ్కేలు. 18:4). “నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను” (యెహేజ్కేలు. 36:24).
ప్రభువు మిమ్ములను దేశమునకు కావలివారిగా ఉంచియున్నాడు. మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, దేశప్రజలు అను వారందరి రక్త అపరాధన మీపైయున్నది. వీరికి సువార్తను ప్రకటించుటయు వీరి కొరకు కన్నీటితో గోజాడుటయు మీ యొక్క భుజములపై పడినయున్న బాధ్యత అను సంగతిని గ్రహించియున్నారా? మీరు గాక వీరికి ఎవరు క్రీస్తు యొక్క సువార్తను పంచి పెట్టగలరు?
కావున మనుష్యులను ప్రియపరిచి పరిచర్యను చేయక, ప్రభువును ప్రియపరచి హృదయ పూర్వకముగా పరిచర్యను చేయుడి. దేవుని యొక్క చిత్తము చొప్పున పరిచర్యను చేయుడి. అది అసంఖ్యాకులకు ఆశీర్వాదమును తెచ్చిపెట్టును.
ఈ లోకము యొక్క అంత్య దినములకు వచ్చి ఉన్నాము. ఎండిన ఎముకలు జీవమును పొందు దర్శనమును ప్రభువు ప్రవక్తయైన యెహేజ్కేలు ద్వారా మనకు బయలు పరచియున్నాడు. సమాధులలో ఉన్నవారును దైవ కుమారుని యొక్క స్వరమును విను కాలము వచ్చును. అది ఇప్పుడే వచ్చియున్నది.
ఒకానొక కాలమునందు ఎండిన ఎముకల వలె పలు దేశములయందు చెదరగొట్ట బడియున్న ఇశ్రాయేలు ప్రజలు, 1948 ‘వ సంవత్సరమునందు స్వాతంత్రమును పొందుకొని, తమ యొక్క దేశమునందు వచ్చి చేరియున్నారు. కాళ్ళను మోపి, లెక్కింప శక్యముకాని మహా సైన్యముగా నిలచియున్నారు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన మనము కూడాను ప్రభువు యొక్క ఆత్మ చేత జీవింప చేయబడి కాళ్ళను మోపి నిలబడుదుముగాక. ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపడుదుము గాక.
నేటి ధ్యానమునకై: “నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా; జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై, కాళ్లుమోపి లేచి, లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి” (యెహేజ్కేలు. 37:10).