No products in the cart.
అక్టోబరు 25 – యిర్మియా!
“గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని” (యిర్మియా. 1:5).
నేడు మనము సంధించబోవుచున్న దేవుని సేవకుని యొక్క పేరు యిర్మియా. అందరును యిర్మియాను, కన్నీటి ప్రవక్త అని పిలచుచున్నారు. బాల్యమునందే యెహోవా యిర్మియాను తన యొక్క మహిమగల పరిచర్య కొరకు పిలిచెను.
యిర్మియా అందులోనుండి తప్పించుకొనుట కొరకు పలు సమాధానములను చెప్పి చూచెను. “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అని అనగా. “అయినను యెహోవా: నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియును చెప్పవలెను” (యిర్మియా. 1:6,7) అని చెప్పెను.
బాబులోనియులు, ఇశ్రాయేలీయులకు విరోధముగా వచ్చినప్పుడు, వారు యిర్మీయాకు అత్యధికమైన కీడును చేసిరి. అయితే దేవుడు యిర్మీయాను స్థిరపరచి, బలపరచి ఆయనను బలమైన ఇత్తడి ప్రకారముగా చేసెను. కావున యిర్మీయా ధైర్యముగా రాజులను, అధిపతులను ఎదిరించి నిలబడి ప్రవర్చించెను. “యెహోవా చేయి చాపి, నా నోరునుముట్టి యీలాగు సెలవిచ్చెను: ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. చూడుము, పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నిన్ను నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను అని యెహోవా నాతో సెలవిచ్చెను” (యిర్మియా. 1:9,10) అని చెప్పెను.
ఫరో యొక్క దండు సైన్యము వచ్చుచున్నదని, కల్దీయుల యొక్క దండు సైన్యము యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోయెను (యిర్మీయా. 37:11). అప్పుడు జనులు యిర్మీయాను పట్టి, ఒక పాడైపోయిన బావిలో పడవేసిరి. అప్పుడు ప్రభువు ఆయనను కాపాడి బయటకు తీసుకుని వచ్చెను. కొన్ని నెలల తర్వాత బబులోనీయులు మరలా వచ్చి, యెరూషలేము పట్టణమును పట్టి కాల్చివేసిరి.
అప్పుడు యిర్మీయా విలపించి దుఃఖమును బయలుపరచెను. అట్టి విలాపము ద్వారా ఆయన ఎంతగా ప్రభువును, దేవుని ప్రజలను ప్రేమించెను అను సంగతిని, దెవుని ప్రజలు యొక్క బ్రష్టత్వమును తట్టుకోలేక ఆయన ఎంతగా కన్నీటిని రాల్చెను అను సంగతిని తెలుసు కొనగలము. నిజమైన దేవుని యొక్క బిడ్డలు ప్రభువు యొక్క హృదయ చప్పుడును గ్రహించి, ఆయన యొక్క సన్నిధానమునందు దేశము కొరకు గోజాడుచున్నారు. అటువంటి గోజాడేటువంటి ఆత్మచేత ప్రభువు మిమ్ములను నింపును గాక.
యిర్మీయా చెప్పుచున్నాడు: “నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక” (యిర్మియా. 9:1). ప్రభువు బైబిలు గ్రంధమునందు అనేక పరిశుద్ధులను, ప్రవక్తలను మన ఎదుట నిలబెట్టియున్నాడు. వారు ప్రభువు కొరకు నిలబడినందున కాలము చేత నశింప బడకుండునట్లు నేడును మనతో కూడా మాట్లాడుచున్నారు.
దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రభువు యొక్క కాడిని తనపై మోసుకుని పరిచర్యను చేసినట్లుగా, మీరును ప్రభువుతో కలసి నిలబడుడి.
నేటి ధ్యానమునకై: “ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును” (యిర్మియా. 33:16).