Appam, Appam - Telugu

జూలై 02 – నివసించువాడు

“బన్యామీనునుగూర్చి: యెహోవాకు ప్రియుడు. ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును; దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజములమధ్య అతడు నివసించును”   (ద్వితి. 33:12).”

బెన్యామీను యొక్క ఆశీర్వాదమును ప్రభువు నేడు మీకు దయచేయునట్లు సంకల్పించెను. ఆనాడు మోషే బెన్యామీను గోత్రమును ఆశీర్వదించినప్పుడు బెన్యామీనను, “యెహోవాకు ప్రియుడు”  అని సూచించెను. బెన్యామీను జన్మించినప్పుడు అతని యొక్క తల్లి అతనికి దుఃఖపుత్రుడు అని చెప్పి బెనోని అని పేరు పెట్టెను. తండ్రైయితే, దానిని మార్చి నా కుడిచేతి పుత్రుడు అని అర్థమునిచ్చు రీతిలో బెన్యామీను అని పేరు పెట్టెను. యాకోబునకు పన్నెండు మంది కుమారులు ఉన్నప్పుడు కూడాను, ఇతడు మాత్రము కనాను దేశమునందు బెత్లహేమునకు సమీపమున జన్మించెను. చూడండి! ప్రభువు ప్రేమతో బెన్యామీనును చూచి,   ‘నీవు నాకు ప్రియుడవు, నీవు నా వద్ద సురక్షితముగా నివసించెదవు’ ‌ అని చెప్పుట ఎంతటి ఆదరణ కలిగించు మాటలు!

ప్రభువు మిమ్ములను ప్రియమైనవాడని పిలుచుటచేత మీరును ఎల్లప్పుడూ ఆయనకు ప్రియమైనవారిగా నడుచుకొనుడి. ఆయనకు ఇష్టమైన వాటిని మాత్రము చేయుటకు సమర్పించుకొనుడి. యేసును చూడుడి.    “తండ్రికి కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను”   (యోహాను. 8:29)  తండ్రికి ప్రీతికరముగా నడుచుకొనుచున్నప్పుడు ఆయన మిమ్ములను విడిచి ఎడబాయడు.  మిమ్ములను చేయ్యి విడిచిపెట్టడు. అది మాత్రమే గాక, మీతో కూడా ఆయన నివాసము చేయును. దానితో పాటు బెన్యామీను యొక్క ఆశీర్వాదమును మీకును దయచేయును. మీరు సురక్షితముగా నివాసముండేదరు.   ‘నేను నిన్ను దినమెల్ల కాపాడి నేను నీ ప్రాకారములలో నివసించెదను’  అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

తెలుగు బైబిలు గ్రంథమునందు   “సురక్షితముగా నివసించును”  అని చెప్పబడియున్న మాట, ఆంగ్ల బైబులు గ్రంథమునందు   “భద్రముగా నివసించును”  అని సూచించబడియున్నది. ప్రభువు యొక్క భద్రత అనేది శ్రేష్టమైన భద్రత. అది మాత్రమే గాక, దినమల్ల నేను నిన్ను కాపాడేదెను అని ప్రభువు వాక్కునిచ్చుచున్నాడు.  దినమెల్ల కాపాడును. తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును దయచేయుట మాత్రము గాక,  మీ యొక్క ప్రాణమునకును  ఆహారమును దయచేసి దినమెల్ల కాపాడును.

లోకము బహాటముగా తెరవబడియున్న స్థితియందు ఉన్నది.  ప్రమాదములును శోధనలును పెరిగిపోవుచున్నది.  సాతాను అనేక మందిని వంచించి పాతాళమునకు నడిపించుచున్నాడు. అయితే ప్రభువు మిమ్ములను దినమెల్ల కాపాడుచున్నాడు. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును; ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును”   (కీర్తన.121:7,8).  దేవుని బిడ్డలారా, ప్రభువును మాత్రము ప్రియ పరచుటకు తీర్మానించుడి. బైబులు పఠించుట యందును ప్రార్ధించుట యందును మాదిరి కరమైన జీవితమును జీవించి, ప్రభువు ఎదుట ప్రీతి గలవారై కనబడుడి అప్పుడు మీరును ప్రభువుచే ఆశీర్వదింపబడుదరు.

 నేటి ధ్యానమునకై: “నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు  నాకు నేర్పుము; దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను  నడిపించును గాక”   (కీర్తన.143:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.