Appam, Appam - Telugu

ఆగస్టు 04 – “దేవుని స్వరూపము చొప్పున”

“మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము”    (అది. 1:26) 

నరులను దేవుడు తన యొక్క పోలికగా సృష్టించునట్లు సంకల్పించెను.    “దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను”   (ఆది. 2:27). ప్రభువు ఆత్మయైయున్నాడు. ఆత్మీయైయున్న దేవుడు నరులలో తనయొక్క ఆత్మను ఉంచి ఉండుట చేతనే నరులచే దేవునితో కూడా ఆత్మయందు సంభాషించి ఆనందింప కలుగుచున్నారు.

కొద్దిగ ఆలోచించి చూడుడి! మీకు తెలియకుండానే అంతరంగము దేవునితో సహవాసమును కలిగి ఉండుటకు పరితపించుచున్నది.  ఒక కప్పతోను, ఎలుకతోను సహవాసమును కలిగి ఉండుటకు మీరు ఎన్నడును కోరుకొనరు.  ఎందుకంటే నరుడు సృష్టింపబడిన విధానము వేరు. మృగములును, నేలపై ప్రాకు జీవులును, మరియు జీవరాసులను సృష్టించబడిన విధానము వేరు.

కప్పలు తమ యొక్క తెగవాటితోనే సహవాసమును కలిగియుండును. ఎలుకలు తమ యొక్క తెగబాటితోనే సహవాసమును కలిగియుడును. అయితే మీరు, దేవుని యొక్క స్వరూపము నందు సృష్టింపబడి యున్నందున,  మీలో దేవుని యొక్క ఆత్ముడు నివాసము చేయుచున్నందున దేవునితో సహవాసము కలిగి ఉండునట్లు పిలువబడియున్నారు.

దావీదు ఆ సహవాసమును ఆత్రుతతో ఎదురుచూచి,   “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు, దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.  నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది;  దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన  సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?”    (కీర్తన.42:1,2)  అని సెలవిచ్చుటను చూడుడి.

మీరు దేవునితో కూడా మీయొక్క శరీరము చేతనైనను, మీయొక్క జ్ఞానము చేతనైనను సహవాసమును కలిగి ఉండుటకు వీలు కాదు.  అదే సమయములో మీరు మీ యొక్క ఆత్మ చేతనే ఆయనతో కూడా సహవాసమును కలిగి ఉండగలరు. మీరు ప్రార్ధించుచున్నప్పుడు మీ యొక్క ఆత్మ అనేది దేవునితో కూడా ఏకమవ్వుచున్నది. ఆత్మతో ఆయనతో కూడా సంభాషించుచున్నారు. యేసు సెలవిచ్చెను:   “దేవుడు ఆత్మయై యున్నాడు.  గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధింపవలెననెను”    (యోహాను.4:24).

లోకమునందు పాపము ప్రవేశించి నరుని యొక్క హృదయమును మలీన పరచబడినందున ఆత్మీయ సహవాసము ఆటంకపరచబడెను. అయినను ప్రభువు నరునితో ఇంకను సంభాషించుటకు కోరి పాపములకై సిలువయందు రక్తము చిందించుటతో మాత్రము గాక, పరిశుద్ధాత్మను కుమ్మరించియు ఇచ్చియున్నాడు.  ఆ పరిశుద్ధాత్ముడు మీ యందు నివాసము ఉండుటచేత ప్రభువుతో కూడా ఇంకను సమీపించి మీ వల్ల జీవించగలరు.

దేవుని బిడ్డలారా, విశ్వాసముతో కూడా,   “మా దేవుడు ఆత్మయైయున్నాడు. మా యందు ఆత్మను ఆయన ఉంచియున్నాడు. మాయొక్క ఆత్మ ప్రభువునందు ఆనందించినట్లు పరిశుద్ధాత్మను మాయందు దయచేసియున్నాడు. కావున ప్రభువుతో కూడా సహవాసమును కలిగియుందుము”  అని చెప్పి దేవుని స్తోత్రించుడి. దేవునితో కూడా కలిగియున్న సహవాసమును నిత్యమును కాపాడుకొనుటకు ప్రయత్నించుడి.

నేటి ధ్యానమునకై: “యెహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు; ఆయన దీనులను రక్షణతో అలంకరించును”   (కీర్తన. 149:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.