సెప్టెంబర్ 17 – సహయముచేయు దేవుడు!

“అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును; ఆయన నా ప్రార్థన నాలకించును”(కీర్తన.55:16,17

ఈ లోకమునందు మీకు సహాయము చేయగల ఒకరు ఉన్నారంటే, అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మీ యొక్క సమస్యల సమయమునందును, పోరాటముల సమయమునందును మనుష్యుల యొక్క సహాయమునే మీరు కోరుచున్నారు. అయితే  “మనుష్యుల సహాయము వ్యర్థము”(కీర్తన 108:12) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

నా యొక్క తండ్రిగారు 12’వ తరగతి చదువును ముగించిన వెంటనే దానికిపై చదువులను చదివించుటకు వారిఇంటి స్తోమతలేకపోయెను. కారణము మా తాతయ్యగారు అప్పటికే ఉద్యోగములో నుండి విరామము పొందియుండెను. అటువంటి సమయమున మా తాతయ్యగారి స్నేహితుడు ఒకరు పని ఇప్పిస్తానని చెప్పి మా నాన్నగారిని చెన్నై పట్టణమునకు వెంటబెట్టుకుని వచ్చెను. చెన్నైకి వచ్చిన వెంటనే, ఆయనను వెంటబెట్టుకుని వచ్చిన ఆయన, ఆయనను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయెను. మా తండ్రిగారు ప్రతిదినమును తన సొంత ప్రయత్నముతో పనిని వేదకుచుండెను. ఆయన చేతిలోనున్న ధనమంతయు ఖర్చయైపోయెను.

తరువాత ఒక దినమున, ఆయన ఆకలితో బయట అగచాట్లు పడుచుండగా, అనుకోకుండా తన అన్నయ్య వీధిలో నడుచుకొని వెళ్లుచుండుటను చూచెను. ఆయన చెన్నైలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగమునందు, మంచి స్థితియందుండెను. ఆయనను చూచినవెంటనే మా తండ్రి గారికి మిగుల సంతోషము. అన్ని సమస్యలకును అగచాట్లుకును ఒక ముగింపు వచ్చును అని తలంచి ఆయన  వెనకాల పరిగెత్తేను. ఆయనకూడా సహాయము చేయుటకు ముందుకురాలేదు.

ఎవరును సహాయము చేయుటకు ముందుకు రాని స్థితియందు, మా తండ్రి గారి మనస్సు తునాతునకలుగా విరిగిపోయెను. వారు తమ వేధననంతటిని మోకాళ్లపై నిలబడి ప్రభువు యొక్క పాదాలచెంత పెట్టి విలపించెను. ఇకమీదట ఎట్టి మనుష్యుని యొక్క సహాయమును ఇక ఎన్నడును వెంటాడును అని తీర్మానించెను. మనుష్యుల యొక్క సహాయము వ్యర్థము అను సత్యమును గ్రహించుకొనెను. ప్రభువును అత్యధికముగా అన్వేషించెను. అప్పటి నుండి ప్రభువు వారి యొక్క జీవితమునందు గొప్ప మార్పును కలుగజేసెను. పై చదువులను చదువుటకై బహు అద్భుతముగా ఆయనకు సహాయము చేసెను. తరువాత వారికి గణితశాస్త్ర ఉపాధ్యాయులుగా ఉద్యోగము లభించెను. ఇంకా కొద్ది దినములలో, ప్రభుత్వమునందు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగమును ప్రభువు ఇచ్చెను. ప్రభువు వారిని అంచలంచలుగా హెచ్చించుటకు ప్రారంభించెను.

ఒక దినము వచ్చెను. ప్రభువు వారిని తన యొక్క పరిచర్యకై పిలిచెను. వందలకొలది ఆత్మీయ తమిళ పుస్తకములను వారు వ్రాయుటకు ప్రభువు సహాయము చేసెను. ప్రభువు  తన సువార్తను ప్రసంగించుట కొరకు ప్రపంచమంతట ఆయనను తీసుకొని వెళ్లెను. ప్రభువే వారికి సమస్త సహాయమును చేసెను. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు కూడా, ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉండవచ్చును. నాకు సహాయము చేయుటకు ఎవరు లేరు, అని అంగలార్చవచ్చును. ప్రభువు తట్టు మొరపెట్టుడి. ప్రభువు మీ యొక్క స్వరమునకు చెవియొగ్గును.  మీకు సహాయము చేయును.

 

నేటి ధ్యానమునకై: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా, అయన వారిని విడిపించును. దీనులను నిరాధారులను, అయన విడిపించును”(కీర్తన.72:12).

Article by elimchurchgospel

Leave a comment