No products in the cart.
జూలై 19 – సమయమును సద్వినియోగ పరచుకొనుడి!
“పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు” (యోహాను. 9:4).
సమయము యొక్క విలువను యేసు చక్కగా ఎరిగియుండెను. భూమియందు ఆయన పరిచర్య యొక్క దినములు మూడున్నర సంవత్సరముల కాలము మాత్రమే. అయితే, ఆ మూడున్నర సంవత్సముల కాలమునందే విస్తారమైన శిష్యులకు శిక్షణయిచ్చి తయారుచేసెను.
యేసు చెప్పేను: “పగలు పండ్రెండు గంటలున్నవి గదా? ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు” (యోహాను. 11:9).
ఈ లోకమునందు మనము తొట్టిల్లకుండా నడుచుటకు ప్రభువు వెలుగును దయచేసియున్నాడు. ఆత్మీయ జీవితమునందు తొట్టిల్లకుండా నడుచుటకు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించియున్నాడు. వెలుగు ఉన్నప్పుడే కాలమును మనము ఆదాయము చేసుకొనవలెను కదా?
గ్రామ పురములయుందు, అనేక క్రైస్తవ యవ్వనస్థులును, సహోదరీలును తమ సమయమును ఎలాగున వ్యర్థపరుచుచున్నారు అను సంగతిని ఎరుగుచున్నప్పుడు బహు వేదనకరముగా ఉన్నది. సహోదరీలు కథ పుస్తకములను, నిష్ప్రయోజనమైన పత్రికలను చదివి సమయమును వ్యర్థము చేయుచున్నారు. బంగారము వంటి సమయము గతించిపోయినదే. ఎన్నడును అది తిరిగి రాదు. ఆనకట్టును దాటి వెళ్లిన వరద నీళ్లు ఏడ్చినను తిరిగి రాదు కదా?
దేవుని బిడ్డలారా, మీరు మీ యొక్క ప్రతి గంట సమయమునకు ప్రణాళిక వేయవలెను. మీ యొక్క జీవితమునకు ఒక ఉద్దేశము ఉండవలెను. మీయొక్క సమయమును మంచి విధమునందు వినియోగ పరుచుకొనుటకు తీర్మానించుడి. ప్రతి దినమును ఉదయ కాలమునందు ‘ఇది ప్రభువు కలుగజేసిన దినము’ అని చెప్పి, ప్రభువును స్తుతించి ఆ దినము కొరకు ప్రభువునందు ఆనందించండి.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నాది: “ఆయన (యేసు) పెందలకడనే లేచి, యింకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు. 1:35). కీర్తనకారుడు కూడాను దేవుని దర్శించినట్లు ఉదయకాలమనే లేచుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు: “తెల్లవారక మునుపే మొఱ్ఱ పెట్టితిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను” (కీర్తనలు.119:147). “ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీయందు నేను నమ్మిక యుంచియున్నాను, నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము, నీ వైపు నా ప్రాణము (మనస్సు) నేనెత్తికొనుచున్నాను. ” (కీర్తనలు.143:8).
ఉదయకాలమునందు దేవుని సమూఖములో కనిపెట్టు కొనియున్నప్పుడు, ఆ దినము అంతయును సద్వినియోగ పరచుకునేటువంటి తీరుతెన్నును పరిశుద్ధాత్ముడు మీకు బోధించును. కొన్ని సమయములయందు కొన్ని అంశముల కొరకు ఒక స్థలమునకు వెళ్లి, కనిపెట్టుకొని ఉండవలసిన పరిస్థితియే గాని, కొనసాగించి పయనిచ్చేటువంటి స్థితియే గాని ఏర్పడవచ్చును.
అట్టి సమయమును కూడా ప్రణాళిక వేసి వినియోగ పరచుకొనుడి. హస్తములలో ఆత్మీయ పుస్తకములను పెట్టుకొనుడి. కల్వారినే తేరి చూచి ధ్యానించుచూనే ఉండుడి. దేవుని బిడ్డలారా, అప్పుడు శాశ్వతమైన ఆశీర్వాదములను పొందుకొందురు.
నేటి ధ్యానమునకై: “మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము” (కీర్తనలు. 90:12).