జూన్ 18 – నిరాకరింపక!

“ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్ధనవైపు తిరిగియున్నాడు” (కీర్తన.102:17)

మన  దేవుడు ప్రార్థనను ఆలకించువాడు మాత్రముకాక, ప్రార్థనకు జవాబుయిచ్చువాడు. కీర్తనకారుడు ఆయనకు, “ప్రార్థనను ఆలకించువాడా”(కీర్తన 65:2) అని ఒక చక్కటి పేరును పెట్టెను. నేడును, ప్రభువు  మీయొక్క ప్రార్థనను ఆలకించువాడైయున్నాడు. ఆయన, “దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు”(కీర్తన 102:17) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

ఈ దిక్కు లేని దరిద్రులు ఎవరు? దిక్కులేని దరిద్రులు అను పదమునకు ఆంగ్ల నిఘంటువునందు తండ్రిని, తల్లిని కోల్పోయినవారు, అనాధలు, దీనస్థితియందున్నవారు, ఒంటరితనమునందున్నవారు, అనియంత అర్థము చెప్పబడుచున్నది. అయితే ఇక్కడ దిక్కులేని దరిద్రులు అని చెప్పుచున్నప్పుడు, నిత్యము దీనస్థితియందున్నవారిని మాత్రము సూచించబడుటలేదు, అది ఎవరైనా ఉండవచ్చును. మహారాజైనా ఉండవచ్చును, యువరాజైన ఉండవచ్చును, అది ఒక నిస్సహాయస్థితియు, ఆదరణలేనిస్థితియునైయున్న వ్యక్తిని సూచించును.

బైబిల్ గ్రంధమునందు యెహోషాపాతు అను చెప్పబడుచున్న ఒక రాజును చూడుడి! రాజుయొక్క జీవితమునందు అతిపెద్ద సమస్యలును, ఉపద్రవమును వచ్చెను. ఆయన బలమునుకు మించిన ఒక గొప్ప సైన్యము వారికి విరోధముగా వచ్చెను. ఆ సమయమునందు ఆయన, “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు”(2. దినవృ. 20:12) అని ప్రార్థన చేసి దిక్కులేని దరిద్రునివలె విలపించి ఏడ్చెను.

2015 ‘వ సంవత్సరమున, చెన్నై పట్టణమందు ఒక గొప్ప భయంకరమైన వరద ప్రవాహము ముంచుకొని వచ్చినప్పుడు, అత్యఅధిక సంఖ్యలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. అకస్మాత్తుగా దిక్కులేని దరిద్రులవలె మారిపోయిరి. అతిగొప్ప కోటీశ్వరులుకూడా బ్యాంకుల నుండి గాని ఏటీఎం కేంద్రాల నుండిగాని, ధనమును తీసుకొనలేకపోయిరి. కలిగియున్న అతిఖరీదైన చేతిచరవాణియైయుండినను. వాటిద్వారా ఎవరిని సంప్రదించలేక పోయిరి.

వారు కలిగియున్న బహు ప్రసిద్ధిగాంచిన బెంజ్ కారులన్నియు వరదనీటిలోనికి మునిగిపోయెను. ఆహారమునకును, నిత్య అవసరములకును దిక్కులేని దరిద్రులుగా నిలిచిరి. అకస్మాత్తుగా ప్రకృతి గొప్పవినాశములోనికి గురవుచున్నది. పరిస్థితులన్నీయు తారుమారైపోవును. అప్పుడు ఎట్టివారైనాసరే దిక్కులేని దరిద్రులైన పరిస్థితికి వెళ్లిపోవుదురు.

దేవుని బిడ్డలారా, మీరు ఇటువంటి దిక్కులేని దరిద్రుల మార్గమునందు సాగిపో వలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువు తట్టుచూచి మొరపెట్టుడి. ప్రభువు నిశ్చయముగా మీకు సహాయము చేయును. ప్రస్తుతమునందున్న దిక్కులేని దరిద్రుల వంటి పరిస్థితినుండి ప్రభువు మిమ్ములను హెచ్చించి ఆశీర్వదించును.

 

నేటి ధ్యానమునకై: “మిమ్మును అనాధలనుగా విడువను, మీ యొద్దకు వత్తును” (యోహను.14:18).

Article by elimchurchgospel

Leave a comment