ఆగస్టు 02 – పరిశుద్ధపరచబడిన పాత్ర!

“నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు (పాత్రయైయున్నాడు)”(ఆ.పో.9:15)

‘ఒక్కడు తన్ను సుద్ధీకరించుకొనినయెడల, అతనిని పరిశుద్ధపరచబడిన పాత్రగా వాడుకొనెదను’ అనుటయే బైబిలు గ్రంథము ఇచ్చుచున్న వాగ్దానము. ‘ఒక్కడు తన్ను సుద్ధీకరించుకొనినయెడల’ అను మాటను మరల ధ్యానించిచూడుడి.

పాత నిబంధనయందు పలు రకములైన శుద్దీకరణలుండెను.  ‘రక్తమును ప్రోక్షించి అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరెచెను'(లేవి.16:19). ‘పాపములనుండి  పవిత్రులగునట్లు ప్రాయశ్చిత్తము చేసిరి'(లేవి.16:30). ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని పవిత్రులగును(సంఖ్య.19:12). ‘మరి వేరు పదార్ధములను పరిమళ క్రియలకొరకై వాడిరి'(ఎస్తేరు  2:12).

కొత్త నిబంధనయందు, మనస్సాక్షియొక్క శుద్ధీకరణను గూర్చి బైబిలు గ్రంథము చెప్పుచున్నది, ‘క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును'(హెబ్రీ.9:14). ‘మన పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి(హెబ్రీ.1:3).  ‘శుద్ధీకరించుకొనినయెడల, మిమ్ములను పవిత్రమైన పాత్రగా వాడుకొనెదెను’ అనుటయే ప్రభువుయొక్క వాగ్దానమైయున్నది.

శుద్ధీకరణ కంటు బైబిలు గ్రంథమునందు ఒక అధ్యాయము ఉందంటే, అది 51 ‘వ కీర్తనయే. అక్కడ దావీదు తాను శుద్దీకరించుకొనుటకు మూడు అంశములను తన్ను విడిచి తొలగించవలెను అని గోజాడుచున్నాడు. 1) నా అతిక్రమములు పోవునట్లు నన్ను తుడిచివేయుము. 2) నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 3) నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము అని బతిమాలుచున్నాడు. ‘హిస్సోపుతో నన్ను  సుదీక్షరించుము, అప్పుడు నేను పవిత్రుడగుదును’ అని విలపించుటను చూడుడి (కీర్తన.51:1,2,7).

మోషేయొక్క జీవితమునందు, ప్రభువు ఒక గొప్ప ఉద్దేశమును కలిగియుండెను. తనయొక్క ప్రజలను ఐగుప్తునుండి విడిపించి, కనాను దేశమునకు తీసుకొని వెళ్ళవలెను అనుటయే ఆ ఉద్దేశము. ఆ ఉద్దేశమునకై మోషేను పవిత్రపరచి సిద్ధపరచ వలసినదాయెను. ప్రభువు చెప్పెను, ‘నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలముపరిశుద్ధ ప్రదేశము'(నిర్గమ.3:5). పరిశుద్ధతగల దేవునియొక్క పనికి, దేవుడు కాంక్షించు పరిశుద్ధత ఉండవలసినది అవశ్యము. అందు నిమిత్తము ప్రభువు నలభై సంవత్సరములు మోషేను శుద్దేకరించెను. ఫరోయొక్క రాజగృహమునందు అభ్యసించిన సకల విద్యలను మరచి ప్రభువును మాత్రమే అనుకొనునట్లు చేసేను.

దేవుని బిడ్డలారా, ప్రభువు పలు శోధనలద్వారా మిమ్ములను నడిపించుకొనుచు ఉండవచ్చును,  దీర్ఘకాలముగా కనిపెట్టుచ్చున్నానే అని మనస్సునందు సోమ్మసిల్లకుడి. ఆయన మిమ్ములను శుద్ధీకరించి పవిత్రపరచుటకు కోరుచున్నాడు అనుటను మరచిపోకుడి. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, ‘దేవుడు తగిన సమయమందు, మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద, దీనమనస్కులై యుండుడి”(1 పేతురు.5:6).

నేటి ధ్యానమునకై: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును”(1.యోహాను.1:9).

Article by elimchurchgospel

Leave a comment