No products in the cart.
అక్టోబర్ 22 – జ్ఞానముయొక్క ఇల్లు!
“జ్ఞానము ఇంటిని (నివాసమును) కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది
పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది” (సామెతలు 9:1,2)
సామెతల గ్రంధమునందు జ్ఞానమును స్త్రీతో పోల్చబడియున్నది. ‘జ్ఞానము తన నివాసమును కట్టుకొని’ అని పైన చుచున్న వచనమునందు సూచించబడియున్నది.
దానికి వివరణ ఇచ్చుచున్న విధమునందు సామెతల గ్రంథము 14వ అధ్యాయమునందు, “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును. “(సామెతలు 14:1) అని సూచించబడియున్నది.
జ్ఞానము తన యొక్క ఇంటిని కట్టుచున్నది. ఆ ఇల్లు అనగా ఏమి? అది ఒక మనిష్యుని యొక్క వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘపరమైన జివితము, అంత మాత్రమే కాదు, అది నిత్య జీవితము కూడాను. మనము భూమి మీద జీవించుచున్న జీవితమే ఈ నాలుగు రకములైన ఇళ్లను కట్టి లేపుచున్నది.
ఒక ఇంటిని కట్టుచున్నప్పుడు, దానిని సంపూర్ణముగా కట్టి ముగించవలెను. అలాగన కట్టి ముగించుటకు దృఢమైన, బలమైనదైయున్న సంభములు మీగుల అవశ్యము. ఆ స్థంబములే కట్టడము స్థిరముగా ఉండుటకు దృఢపరుచును
చెన్నై క్యాతిడ్రల్ ఆలయములో బయట గుమ్మమునందు బాహు గంబెరమైన ఎత్తైన స్థంభములు కలవు. ఆ స్తంభములను చూచుచున్నప్పుడెల్లా అవి ప్రభువు యొక్క మహత్యములను, ఔన్నత్యములను జ్ఞాపకము చేయుచున్నది. అంతటి గొప్ప బలమైన స్తంభములు, ఆ ఆలయమును ఆదుకొని నిలబెట్టుచున్నది.
ఆనాడు యాకోబు ఒక గొప్ప రాయిని తీసుకుని స్తంభముగా నిలబెట్టెను. “మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును”. (ఆది. 28: 22) అని చెప్పెను.
కొత్త నిబంధనయందు అపోస్తులుడైన పౌలు వ్రాయిచున్నాడు. “దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు (నీవెలాగు) ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది” (1తిమోతికి 3: 15)
సామెతల గ్రంథమునందు గల అధ్యాయములను మరలా మరలా చదువుకున్నప్పుడు ఏడు అంశములు స్తంభములవలె నిలబడియుండుటను చూడగలము. అవి ఏవనగా? 1. దేవునియందు ఉంచేటువంటి నమ్మిక, 2. యథార్థత, 3. ఉదారత్వము, 4. ఉత్సాహకరమైన కఠినశ్రమ, 5. విశ్వాసపు మాటలు, 6. స్నేహము, 7. పరిశుద్ధతైయున్నది.
కొందరు, ఆ ఏడు స్తంభములను కొత్త నిబంధనయందు ఇవ్వబడియున్న ఏడు విధమైన ఉపదేశపు పునాదులకు పోల్చుచున్నారు. ఇట్టి జ్ఞానమును మీరు ఆత్మీయ ఆహారముగా స్వీకరించున్న అదే సమయమునందు, కొంత సమయము ఖర్చుపెట్టి సామెతల గ్రంథమును పూర్తిగా చదువుడి. దేవుని బిడ్డలారా, నేడును అత్యధికమైన ఆత్మీయ ప్రత్యక్షతలను, సత్యములను మీరు దిట్టముగా పొందుకొనుటకు అది మార్గమును తెలుపుచున్నది.
*నేటి ధ్యానమునకై:* “జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు” (ప్రకటన 3: 12).